మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా ద్వితియంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా షస్టమం లో, కేతువు ద్వాదశ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం : 05 వ్యయం: 14 గౌరవం : 05 అవమానం: 04 ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విజయాలను పొందుతారు ముఖ్యంగా గరువు, శని బలం మూలాన బాగుంటుంది కేతువు కూడా మేలు చేస్తాడు గత సంవత్సరం కన్నా బాగుటుంది. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు కొత్త పనులను చేపడుతారు. అన్నిరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అనుకూలమైన వాతవరణం ఉంటుంది ప్రతికూలాలు తొలగిపోతాయి. ఆర్థికంగా బాగుటుంది డబ్బుల విషయంలో లోటు ఉండకపోవచ్చును. గత సంవత్సరం మీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు దాదాపు తొలగిపోతాయి కాకపోతే సమస్యలు కలిగి నప్పుడు కావొచ్చు మరేవిషయంలో నైనా సరే మానసిక దృడంగా ఉండాలి మీ మనోదైర్యమే మీకు శ్రీరామ రక్ష అనిచెప్పుకోవచ్చు. బంధువులలోను మిత్రులలోను పేరును సంపాదించుకుంటారు కీర్తిని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చాలా ఎక్కువగా పాల్గొంటారు ఇది బాగా ఉపయోగపడుతుంది మీ ఎదుగుదలకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీకు ఏమైనా కోర్టు వ్యహారాలు ఉన్నా సొంతఇంటి ఆశలు కలిగి ఉన్నా అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చును గట్టిగా ప్రయత్నం చేయడం ద్వార ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగాపండి దిగుబడులు సంతృప్తిని ఇస్తాయి అనువైన పంటలు వేయడం ద్వార లబ్దిని పొందగలరు. వ్యాపారస్థులకు లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇటు ఉద్యోగులకు అటు కళాకారులకు ,క్రీడాకారులకు ఆదాయం బాగుటుంది గతం కన్నా పెరుగుతుంది మీరు పనిచేసే స్థానంలో మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంటారు సంతోషంగా ఉంటారు స్త్రీలకూ చాల అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చును వారు అనుకున్న పనులను నేరవేర్చుకొగలుగుతారు. రాజాకీయ నాయకులకు పదవులు లభిస్తాయి కొద్దిగా శ్రమించి తెలివి తేటలను వాడినచో మంచి అభివృద్ధిని పొందుతారు. అనారోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచుకోండి. విద్యార్థులు తమ దృష్టిని చదువు పైన పెడితే మాత్రం విజయాలు తథ్యం అలాగే దూరద్రుష్టిని కలిగి ఉండటం మంచిది ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే వాటికోసం ప్రయత్నం చేసే వారు శ్రద్ద పెట్టండి మేలు జరుగుతుంది. తీర్థయాత్రలు చేయుట వంటి వాటికి ప్రాముఖ్యతను ఇస్తారు విజ్ఞాన సముపార్జన దిశగా అడుగులు వేస్తారు. మాసముల వారిగా: ఏప్రిల్: ప్రయత్నములలో శ్రద్ధను చూపించుట మేలు చేస్తుంది. కర్తవ్యంను మరిచిపోకండి పట్టుదలతో పనులను పూర్తిచేయుట మంచిది. ఆర్థిక వ్యహరాల్లో బాగానే ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది. శుభకార్యములను చేయుటకు అవకాశం కలదు. మే: అనారోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి ప్రయాణాలు కలిసిరాకపోవచ్చును అలాగే ప్రయాణాలు వాయిదా పడుతాయి. నవగ్రహారాధన అవసరం అలాగే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. జూన్: శత్రువుల యొక్క ప్రభావం మీపైన రానురాను తగ్గుతుంది ఆర్థికమైన విషయాల్లో కొద్దిగా మార్పు మొదలవుతుంది. బంధు మిత్రులను కలుస్తారు ఇతరులతో సంభందాలు మెరుగుపర్చుకోవడం మేలు చేస్తుంది. జూలై: చేపట్టిన పనులలో విజయం ఉంటుంది ఆదాయం విషయంలో బాగుటుంది ఉద్యోగులు అభివృద్దిని కలిగి ఉంటారు ప్రమోషన్ లభించుటకు అవకాశం ఉంటుంది. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలు బాగున్నవి. ఆగష్టు: నిరుద్యోగులకు ఉద్యోగములు లభిస్తాయి వివాహంనకు మంచి సమయం. తీర్థయాత్రలు చేయుటకు అవకాశం కలదు ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగంలో కాస్తానిదానంగా వ్యహరించగలరు. సెప్టెంబర్: ప్రయాణములు చేయుటకు అవకాశం కలదు నూతన పనులను కుటుంభంలో అందరు కలిసి నిర్ణయాలు తీసుకొనుట అనారోగ్యం కొరకు ఖర్చులు సూచిస్తున్నాయి. అక్టోబర్: వృత్తి వ్యాపారములలో మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలిగినప్పటికిని వాటిని దైర్యంతో ఎదుర్కొంటారు. ఖర్చులు కొంత పెరుగటకు అవకాశం కలదు. నవంబర్: వృత్తి వ్యాపారములలో మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలిగినప్పటికిని వాటిని దైర్యంతో ఎదుర్కొంటారు. ఖర్చులు కొంత పెరుగటకు అవకాశం కలదు. డిసెంబర్: నూతన పరిచయాలు కలుగుతాయి మీ మద్యలో అనుభందం వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో పేరును సంపాదించుకుంటారు అభివృద్ధి ఉంటుంది అర్థికాబివృద్దిని పొందుతారు. అనారోగ్యం కొంత ప్రభావం చూపుతుంది. జనవరి: పెద్దలతోను అధికారులతో నిదానంగా వ్యహరించుట మేలు. స్వల్పంగా పట్టుదలను కలిగి ఉంటే విజయం తప్పక వరిస్తుంది. రుణములు ఇవ్వకండి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఫెబ్రవరి: విదేశీయోగములు కలవు ఇష్టమైన పనులను పూర్తి చేస్తారు శుభాకార్యములు జరుగుటకు అవకాశం కలదు. వృత్తి ఉద్యోగాలలో ముందుకు వెళ్తారు. మార్చి: చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు. గొప్పవారి సహాయంను పొందుతారు ఆర్థికంగా బాగుటుంది కాకపోతే ప్రతి విషయంలో మీ సొంత పర్యవేక్షణ అవసరం. పూజలు: నమకం పారయణం చేయుట అలాగే గణేశ పంచ రత్నములు పారాయణ చేయండి తరుచు గణపతికి అభిషేకాలు చేయించుకోండి అలాగే బుధవారాలు గణపతి దేవాలయం లేదా వేంకటేశ్వరస్వామి దేవాలయం వెళ్ళడం మంచిది. సూర్యనమస్కారాలు చేయడం మూలాన ఆరోగ్యం సిద్దిస్తుంది. సుబ్రమణ్య ఆరాధనా మాత్రం తప్పక చేయాలి. వీలైతే మంగళవారాలు సుబ్రమణ్య స్వామిని పూజించుట మేలుచేస్తుంది. ఆంజనేయ ఆరాధన మంచిది. దానాలు లేదా జపాలు: కేతువుకు జపాలు చేయుంచుట ఉలువలు దానం చేయుట చేయండి సూర్యునకు జపాలు చేయించుట గోదుమలు దానం ఇవ్వడం మేలుచేస్తుంది. అదృష్ట సంఖ్యలు: 6, 15, 24.

మరింత సమాచారం తెలుసుకోండి: