ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా నవమంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా జన్మంలో, కేతువు కళత్ర స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 05 వ్యయం: 14 గౌరవం: 06 అవమానం: 03 ఈ సంవత్సరం మొదటి ప్రథమార్థంలో ఇబ్బందులను ఎదుర్కొన్నా ద్వితీయార్థం పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది పనులు కొంత మేర వేగవంతం అవుతాయి. ఏలినాటి శని ప్రభావం మూలాన ఇబ్బందులు కలుగుతాయి కావున నీ ఆలోచన్లు మార్పులు పనిలో నిబద్దత అవసరం. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది కావున ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు చేపట్టుట మంచిది అలసత్వం ప్రదర్శిస్తే భాదలు తప్పకపోవచ్చును. చేపట్టేపనుల్లో ఎదురైన ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు ఓపిక అవసరం ఫలితాలకోసం శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కాస్త ఇబ్బంది కాలమనే చెప్పుకోవచ్చును. ఉద్యోగ స్థానంలో నిదానంగా వ్యహరించుట కొద్దిగా మాట్లాడేటప్పుడు కోపాన్ని అలసత్వాన్ని ప్రదర్శించకుండా అధికారులతో తోటి ఉద్యోగులతో మంచిగా ఉండటమనేది సూచన. నిరుద్యోగులకు కొంత గడ్డుకాలమనేచెప్పుకోవచ్చును మీ స్థాయికి తగ్గ ఉద్యోగం రావడానికి సమయం పట్టుటకు ఆస్కారం కలదు కావున వచ్చిన ఉద్యోగంతో సర్దుకోవడం సమయం కోసం ఎదురుచూడడం అనేది ఉత్తమం. రాజకీయ నాయకులకు ప్రథమార్థం చివరి నుంచి బాగుంటుంది ప్రనాలికా ప్రకారం నడుచుకోవడం మూలాన పదవులను పొందుటకు అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల పైన దృష్టిని లగ్నం చేయడమనేది సూచన విద్య అనుకూలంగా ఉన్నప్పటికిని ఇతర వ్యాపకాల మూలాన ఫలితాలు తగ్గుటకు అవకాశం ఉంది అలాగే పరిక్షలకు ప్రీపేర్ అవుతున్న వారు కొంత స్నేహాలను తగ్గించి మీ లక్ష్యంపైన దృష్టిని పెట్టుట అనేది సూచన. కళాకారులకు అలాగే క్రీడాకారులకు శుబాశుబాలు మిశ్రమంగా ఉంటాయి కావున కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుట చేసేపనిని మెలుకువతో చేయడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మేలు చేస్తాయి. ఈసారి మీకు గతంలో కన్నా ఆదాయం బాగానే పెరిగినప్పటికిని ఖర్చులు కూడా అదేస్థాయిలో పెరుగుటకు అవకాశాలు కలవు జాగ్రత్త వహించండి. వ్యాపారస్థులు కొంత ఊరటను పొందుతారు లాభములు కలుగుటకు అవకాశం ఉంది కొంత సంతృప్తిని కలిగిఉంటారు. రైతులు పెట్టుబడులు మితంగా పెట్టడం మంచిది మీకు పెద్దగా అనుకూలంగా లేదు కావున పాడిపైన దృష్టిని పెట్టండి. నిరుద్యోగులకు పట్టుదలే ఆయుధం మర్చిపోకండి గట్టిగా ప్రయత్నం చేయండి. మాసముల వారిగా: ఏప్రిల్: కుటుంభంలో కొద్దిపాటి చికాకులు కలుగుతాయి మొత్తం మీద కొద్దిగా వృత్తిస్థానంలో ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు నిదానంగా వ్యహరించుట సూచన. అనారోగ్యంను అశ్రద్ద చేయకండి. విద్యార్థులు చదువుపైన దృష్టిని పెట్టాలి. మే: చేసేపనిలో శ్రద్దపెట్టండి మీ ప్రతి ప్రయత్నంలో పట్టుదల అవసరం. రుణప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంభ వ్యక్తుల మధ్య అవగాహన లోపిస్తుంది. వృత్తి ఉద్యోగంలో కొద్దిగా మార్పులు కోరుకుంటారు. జూన్: చేపట్టిన పనులను కొద్దిగా శ్రమను పొందినప్పటికిని పూర్తిచేస్తారు విద్యార్థులకు బాగానే ఉంటుంది మంచి ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఆరోగ్య సమస్యలు భాదించుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మీ పరిదిని దాటకండి. జూలై: వివాహ ప్రయత్నాలు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొంత గట్టిగ ప్రయత్నం చేయండి. ధనంను ఆధ్యాత్మిక విషయాలకై వెచ్చిస్తారు. స్త్రీలకు అన్నివిధాల బాగుటుంది. ఆగష్టు: అధికారవర్గంచే ఒత్తిడిని పొందుతారు మీరు ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో నిదానంగా వ్యహరించాలి ముందు చూపు అవసరం. బంధువర్గం నుండి ఒక దుర్వార్తను వినుటకు అవకాశం కలదు. సెప్టెంబర్: కొద్దిపాటి హుషారును కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు కాకపోతే పనులను మధ్యలోనే విరమించుకుంటారు. మీ కుటుంభ సభ్యుల ఆరోగ్యం విషయాలో జాగ్రతలు అవసరం. అక్టోబర్: వ్యాపారస్థులు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఆర్థికంగా పెద్దగా ఆశాజనకంగా లేకపోయినా అప్పులను చేయరు. విమర్శలకు దూరంగా ఉండటం అందరిని కలుపుకొని వెళ్ళుట మేలుచేస్తుంది. నవంబర్: ఆరోగ్యం విషయంలో శ్రద్ధను చూపండి నూతన వ్యవహారములకు దూరంగా ఉండటం అనేది సూచన. ఉద్యోగముయందు అదనపు లాభంను కలిగి ఉంటారు అలాగే ఊహించని సంఘటనలు జరుగుతాయి. డిసెంబర్: ప్రేమ పూర్వకంగా ఉండటం సమయపాలనను పాటించుట బద్దకంను వీడుట మూలాన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. రావాల్సిన వాటికి ఇచ్చే ప్రాముఖ్యతను ఇచ్చ్చే వాటికి ఇవ్వాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. జనవరి: కుటుంభంలో భాగస్వామికి ప్రాముఖ్యతను ఇవ్వడం మంచిది మీ తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది. తలపెట్టిన పనులను నిదానంగానైనా పూర్తిచేస్తారు. ఫిబ్రవరి: మీ భాగస్వామికి నచ్చిన విధంగా ఉండటం సూచన అనారోగ్యంను అశ్రద్ద చేయకండి. వ్యసనాలు అయ్యే అవకాశం ఉంది వాటికి దూరంగా ఉండటం అనేది సూచన. మీ సహయకులపైన ప్రత్యెక శ్రద్ధను చూపించండి. మార్చి: స్థాన మార్పులకు అలాగే ఉద్యొగ మార్పులకు ప్రయత్నం చేయకండి కొంత ఓపికతో ఉండుట మూలాన మేలు జరుగుతుంది. దైవ సంభంద కార్యక్రమాల్లో పాల్గొనుట ఉత్తమం. అనుకూలమైన పనులు చేపడుతారు కొంత వరకు బాగుటుంది. పూజలు: దుర్గాసప్తసతి పారాయణ అలాగే కాలభైరవాస్టకం చదవండి శనివారాలు ఉపవాసం ఉండుట అలాగే ఆరోజు ఆంజనేయ ఆలయం సందర్సించుట శనిత్రయోదశి రోజున శనికి తైలాభిషేకం మంచిది. ప్రతిరోజు అన్నపూర్ణాదేవిని లేదా దుర్గాదేవిని పూజించుట మేలు సుబ్రమణ్య ఆరాధన కూడా చేయండి 16 శనివారాలు గోమాతకు పచ్చగడ్డి తినిపించండి. వరుసగా 17 బుధవారాలు లక్ష్మీ - వేంకటేశ్వరస్వామి ఆలయం సందర్శించుట మంచిది. దానాలు లేదా జపాలు: రాహువుకు జపాలు అలాగే మినుములు దానం ఇచ్చుట శనికి జపాలు నల్లనువులు దానం ఇచ్చుట ఖుజునకు జపాలు అలాగే కందులు దానం ఇచ్చుట చేయండి. అదృష్ట సంఖ్యలు: 06, 15, 24

మరింత సమాచారం తెలుసుకోండి: