మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
 ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతం సప్తమంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా ఏకాదశమంలో, కేతువు పంచమ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం : 14 వ్యయం: 11 గౌరవం: 05 అవమానం: 06 ఈ సంవత్సరం మీకు అన్నివిధాల బాగుంటుంది అనిచెప్పుకొవచ్చును ఆర్థికంగా అభివృద్దిని కలిగి ఉంటారు అధిక రాబడిని పొందుటకు అవకాశాలు కలవు అలాగే సంఘంలో గుర్తింపు కలుగుటకు అవకాశాలు చాల ఉన్నవి వాటిని ఉపయోగించుకొనే ప్రయత్నం చేయండి. మీరు గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న సొంతింటి పనులు వేగంగా ముందుకు సాగుతాయి మీరు చేయవలిసిన పని ఒక్కటే కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయటం మూలాన మీ కలనేరవేరుతుంది. గతంలో అసంపూర్తిగా మిగిలిన పనులు అలాగే నూతనంగా చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేయుటకు అవకాశం ఉంది. కొత్తగా ఏమైనా ఆలోచనలు కలిగి ఉన్నచో అమలు చేయుటకు మంచి సమయం అని గుర్తించుకోండి ఆదిశగా పనిని మీ ఆలోచనలను ఆరంభించండి. గతం కన్నా ఆరోగ్యం ఈసారి బాగుటుంది సమస్యలు తోలుగుటకు అవకాశం ఉంది. కుటుంభంలో ఏమైనా సమస్యలు లేక చినపాటి ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి బాగుంటుంది మీరుకూడా కొద్దిగా సర్దుకుపోవడం సూచన. రైతులకు గతంలో మీరు చేసిన రుణాలను తీరుస్తారు పెట్టిన పెట్టుబడులు వస్తాయి పంట దిగుబడి బాగుటుంది సంతోషాన్ని పొందుతారు చక్కటి ఆలోచనలు కలిగి ఉండి మంచి పంటలు వేయడమనేది సూచన. ఉద్యోగులకు అభివృద్ధి ఉంటుంది ఉన్నత పదువులు లభించుటకు అవకాశం ఉంది మీరు అనుకున్నది జరుగుటకు అవకాశాలు కలవు మీ ఆలోచనలను అమలుచేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు బాగానే ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాదిస్తారు విజయాలను పొందుటకు అవకాశం ఉంది దైర్యంగా ముందుకు వెళ్ళడం మేలు చేస్తుంది. కళాకారులకు అలాగే క్రీడాకారులకు చాలావరకు విజయవంతంగా నడుస్తుంది ప్రతిభను గుర్తిస్తారు ప్రోత్సాహం లభిస్తుంది మీరు అనుకున్నవి పొందుటకు అవకాశాలు చాలావరకు ఉన్నవి. స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది నూతన పనులను చేపట్టండి అలాగే సంతోషంగా ఆనందంగా గడుపుతారు తీర్థయాత్రలకు లేదా విహరయాత్రలకు వెళ్లే అవకాశాలు కలవు. రాజకీయ నాయకులు ప్రజాభిమానాన్ని అలాగే గుర్తింపును పొందుతారు పదవులు లభిస్తాయి అలాగే చాలావరకు వారి కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నవి. విదేశీ ప్రయత్నాలు అనుకూలించక పోవచ్చును కొద్దిగా ఆటంకాలు కలుగుతాయి, పారిశ్రామికులకు ద్వితీయార్థం బాగుటుంది. మాసముల వారిగా: ఏప్రిల్: మీరు చేపట్టే పనులలో శ్రద్దను చూపండి పట్టుదలతో ప్రయత్నం చేయండి ముందుకు వెళ్తారు. కుటుంభంలో విందులు చేయుటకు అవకాశాలు కలవు ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఇబ్బందిని పొందుతారు. మే: మీయొక్క ఆలోచనలు కలిసిరాకపోవచ్చును ఎదురు దెబ్బలు తగులుతాయి. తప్పనిసరిగా ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు అలాగే వివాదములు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండండి. జూన్: నూతన వ్యాపారాలయందు ఆసక్తిని కలిగిఉంటారు మీకు సహకరించే వారు పెరుగుతారు కొంత దైర్యంతో ముందుకు వెళ్తారు. సమయాన్ని వృధా చేయకండి గట్టిగా ప్రయత్నంతో ముందుకు వెళ్ళడం మేలు చేస్తుంది. జూలై: కుటుంభంలో నిదానం అవసరం వ్యాపారస్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు ఆర్థిక విషయాల్లో తప్పులకు అవకాశం ఇవ్వకండి తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. బంధువుల సహకారం ఉంటుంది మాట పట్టింపులకు పోకండి. ఆగష్టు: చేపట్టిన పనులలో ఇబ్బందులు పెరుగుటకు అవకాశం కలదు స్థానచలనములు కలుగుటకు ఆస్కారం కలదు. ప్రయాసను పొందుతారు ఆటంకాలు కలుగుతాయి అయినప్పటికిని పనులను పూర్తిచేస్తారు. సెప్టెంబర్: ప్రయాణాలు చేయుట మంచిదికాదు వీలైతే వాయిదా వేసుకోండి. ఉద్యోగంలో శ్రమను పొందుతారు సర్దుకుపోవడం మేలుచేస్తుంది. వృత్తిలో ఉద్యోగంలో చికాకులు కలుగుతాయి. అక్టోబర్: చేపట్టిన పనులను చివరకు పూర్తి చేస్తారు ఆత్మీయులతో సమయాన్ని గడుపుతారు కుటుంభంలో గౌరవాన్ని పొందుతారు. సంతానపరంగా సౌఖ్యంను పొందుతారు. వ్యాపారంలో బాగనే ఉంటుంది. నవంబర్: ఇతరులచే సహకారం అందుతుంది అధికారంను పొందుతారు మానసికంగా అనందంను పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు కుటుంభ సౌఖ్యముంటుంది. డిసెంబర్: మిశ్రమ ఫలితాలు పొందుతారు చేపట్టిన పనులలో కొన్నింటిని పూర్తిచేస్తారు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట వారికి అనుగుణంగా నడుచుకోండి. జనవరి: అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొనుట మేలు చేస్తుంది. ఆరోగ్యంనకు ప్రాదన్యతను ఇవ్వండి మిత్రుల సహకారంతో కొన్నిపనులను ముగిస్తారు. తీర్థయాత్రలు చేయుటకు అవకాశం కలదు. ఫిబ్రవరి: ధనదాయం పెరుగుతుంది చేసే పనులలో విమర్శించేవారు పెరుగుతారు కాని దైర్యంతో మిత్రుల సహాకారంతో ముందుకు వెళుతారు . కవులకు సన్మానం లభిస్తుంది.   మార్చి: అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుటకు అవకాశం కలదు. మాటకు విలువ పెరుగుతుంది సంతోషాన్ని పొందుతారు. గతంలోని బకాయులు వసులు అవుటకు అవకాశం ఉంది. పూజలు: సుందరకాండ పారయణ అప్పుడప్పుడు చదవండి కనకధార స్త్రోత్రం పారాయణ మంచిది విష్ణువును పూజించుట అలాగే తరచూ శ్రీకృష్ణ మందిరం వెళ్ళండి లక్ష్మీదేవిని ఆరాధనా చేయండి ప్రతిరోజు సుబ్రమణ్య ఆరాధన అలాగే అభిషేకాలు మేలు చేస్తాయి. దానాలు లేదా జపాలు: ఖుజునకు జపాలు అలాగే కందులు దానం ఇచ్చుట చేయండి చంద్రునకు బియ్యం దానం ఇవ్వడం జపాలు చేయండి. అదృష్ట సంఖ్యలు: 03, 12,  21, 30.   

మరింత సమాచారం తెలుసుకోండి: