మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
ఈ రాశివారికి గురుడు సంవత్సరమంతా పంచమంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా నవమంలో, కేతువు తృతీయ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గతసంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 02 వ్యయం: 08 గౌరవం: 04 అవమానం: 02 గత సంవత్సరం కన్నా గౌరవాన్ని అధికంగా పొందుటకు అవకాశం కలదు మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా రాను రాను బాగుటుంది అనిచెప్పుకొవచ్చును. గతంలో మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించుటకు ముందు సాధ్యసాద్యాలను ఆలోచించుట తప్పక మేలుచేస్తుంది. సంఘంలో కీర్తిప్రతిష్టలకు లోటు ఉండదు. ధనాదాయం బాగుంటుంది అదేవిధంగా ఖర్చులు కూడా కలుగుతాయి ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది ఖర్చులను అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు చిన్న చిన్న నివారణ చర్యలు సరిపోతాయి కంగారు పడకండి కాకపోతే అశ్రద్ద కూడా చేయకండి. అన్నదాతలకు బాగుటుంది ఉత్సాహంతో ముందుకు వెళ్తారు దిగుబడులు బాగానే ఉంటాయి సంతృప్తిని పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దగా మార్పులు ఏమి ఉండవు అలాగని భాదలు ఉండే అవకాశం లేదు. రాజకీయ నాయకులకు బాగుటుంది అనుకున్న పదవులను అలంకరిస్తారు. మీ పైవారితో మీకున్న అనుభందం బలంగా తయారయ్యే అవకాశముంది. ఉద్యోగులకు బాగుటుంది మీరు ఆశించిన చోటుకు బదిలీలు జరుగుటకు అవకాశం ఉంది సంతోషాన్ని కలిగి ఉంటారు పదోన్నతులు కలిగేందుకు అవకాశం ఉంది గౌరవాన్ని పొందుతారు. నిరుద్యోగులు కొద్దిగా శ్రమించండి చాలు మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రయత్నంలో లోపం చేయకండి. కళాకారులకు అలాగే క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి చేసేపనిలో శ్రద్దఅవసరం. పట్టుదలతో మీరు అనుకున్నవి సాదిస్తారు అధికారులతో అలాగే మీ ఇంటి పెద్దలతో నిదానంగా వ్యహరించండి. స్నేహతులు పెరుగుతారు శత్రువులు తగ్గుటకు ఆస్కారం ఉంది శతృవులే మిత్రులుగా మారే అవకాశం కలదు. మాసముల వారిగా:  ఏప్రిల్: చేపట్టిన పనులలో పట్టుదలను కలిగి ఉంటారు ఖర్చులు పెరుగుట మూలాన కొంత సతమవుతారు. కుటుంభంలో చినపాటి వివాదములు కలుగుతాయి సర్దుకుపొండి. సమయంను వాడుకోండి. మే: మీరు విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది తరుచు చేసే పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు అనారోగ్యంను కూడా అశ్రద్ద చేయకండి. అధికారులతో నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి. జూన్: వృత్తి, వ్యాపారములు అనుకూలిస్తాయి ధనలాభం ఉంటుంది.  బంధువులను మిత్రులను కలుస్తారు మనోదైర్యంతో ముందుకు వెళ్తారు. శుభాప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత ఈ మాసం గతం కన్నా బాగుంటుంది. జూలై: ఈ మాసం అదాయంకోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాదములకు దూరంగా ఉండటమనేది సూచన. అకారణంగా ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. పనులు అనుకున్న విధంగా ముందుకు వెల్లకపోవడం చేత కొంత చిరాకును పొందుతారు. ఆగష్టు: ఉద్యోగులకు స్థానచలనమునకు అవకాశాలు కలవు నూతన వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. ఉద్యోగంలో మీ యొక్క భాద్యతలకు పెద్దపీటవేయండి. కుటుంభంలో చికాకులు తప్పకపోవచ్చును. సెప్టెంబర్: మంచికి వెళితే చెడు ఎదురవుతుంది ఇతరుల విషయాల్లో కలుగ జేసుకోకండి. నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. బంధు వర్గంతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశముంది. ప్రయాణాలు కలిసివస్థాయి. అక్టోబర్: అనవసరపు ఆలోచనలు చేయుట మూలాన కొన్ని పనులను జారవిడుచుకుంటారు జాగ్రత్తవహించండి. చేపట్టిన పనులలో మద్యలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. నవంబర్: ఉద్యోగంలో ఒత్తిడిని కలిగిఉంటారు పనిభారం ఉంటుంది. శతృవుల మూలాన కొంత మేర ఇబ్బందులను ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండటం సూచన. నూతన పనులను చేపట్టకండి ముందు గతంలోని పనులను పూర్తిచేయండి. డిసెంబర్: చినపాటి ఆటంకాలు కలిగినను పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవసంభంద కార్యక్రమాలలో పాల్గొనుట మేలు చేస్తుంది. జనవరి: అధికంగా శ్రమను పొందుతారు వ్యయాన్ని కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు అలోచించి నిర్ణయాలు తీసుకోండి. నా అనుకున్నవారు శత్రుకూటమిలో చేరుటకు అవకాశం కలదు. ఫిబ్రవరి: హమీలకు మంచి సమయం కాదు కావున వీటికి దూరంగా ఉండటం అనేది సూచన. చిన్న పనిని అయినా సరే మీరే చేపట్టండి పనులు సాగుతాయి. వాదొపవాదములకు అవకాశం ఇవ్వకండి తగిన జాగ్రత్తలు పాటించుట మేలు చేస్తుంది. మార్చి: మీ గమ్యం వైపు ప్రయాణం చేయండి పెద్దమనిషి పాత్రకు దూరంగా ఉండటం మీయొక్క పనుల్లో సమయాన్ని గడపడం సూచన. అనారోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. పూజలు: గోమాతను పూజించుట మేలుచేస్తుంది గణపతికి సంకష్టహరచతుర్థి రోజున అభిషేకాలు తప్పక చేయాలి ఆంజనేయ స్వామి ని పూజించుట మేలుచేస్తుంది. దుర్గాదేవి ఆలయానికి తరచు వెళ్ళడం సూచన సుబ్రమణ్య స్వామికి అభిషేకాలు చేయించుట మేలు చేస్తుంది. దానాలు లేదా జపాలు: ఖుజునకు జపాలు అలాగే కందులు దానం ఇచ్చుట చేయండి శనికి జపాలు చేయడం నువ్వులు దానం ఇచ్చుట మంచిది రాహువుకు మినుములు దానం ఇవ్వడం జపాలు చేయడం మేలు చేస్తుంది. అదృష్ట సంఖ్యలు: 08, 17, 26. 

మరింత సమాచారం తెలుసుకోండి: