మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి     => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి     => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
 ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా చతుర్థంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా అస్తమంలో, కేతువు ద్వితీయ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 14  వ్యయం: 11  గౌరవం : 07  అవమానం: 02 ఈ సంవత్సరం మీయొక్క ఆదాయానికి తగ్గుట్టుగా ఖర్చులు ఉంటాయి ఖర్చులను కొద్దిగా అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవభక్తి పెరుగుతుంది. స్థలమార్పిడికి అవకాశం ఉంది. మీవి కాని విషయాల్లో కలుగ చేసుకోకండి అకారణంగా వివాదములలొ ఇరుక్కొనే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట మేలు చేస్తుంది. ఉద్యోగులు మీ ఉద్యోగ స్థానంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మేలు చేస్తుంది సర్దుబాటు విధానం కలిగి ఉండటం మేలుచేస్తుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి మీకు పెద్దగా అనుకూలతలు లేవు కావున నిదానంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. వ్యాపారస్థులు తమ పరిదిని విస్తరించే ప్రయత్నాలు మానుకోవడం ఉత్తమం మీకు పెద్దగా లాభములు కలగక పోవచ్చును పెట్టుబడులు ఇష్టమొచ్చినట్లుగా పెట్టకండి ఆర్థిక నియంత్రణ అవసరం. రైతులు పెద్దగా పెట్టుబడులు పెట్టకండి చిన్న చిన్న పనులు చేసుకోవడం ఇతర మార్గాలను వెతకడం ఉత్తమం. విద్యార్థులు గట్టిగా కష్ట పడితే ఫలితాలు మీరు ఆశించిన విధంగా వస్తాయి పోటీ పరిక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కష్టపడటం మూలాన విజయాన్ని పొందుతారు. కళాకారులకు అలాగే క్రీడాకారులకు బాగుంటుంది మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు శ్రమను పొందినప్పటికిని దానికి తగ్గ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆరోగ్యంను అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు పాటించుట మేలు చేస్తుంది. చిన్న చిన్న పరిశ్రమల వారు మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటారు కొంత నిదానంగా ఉండండి. నిరుద్యోగులు లభించిన అవకాశములను తప్పక ఉపయోగించుకోవాలి విద్యార్తులు ఒకట్కి రెండు సార్లు చదవడం మేలుచేస్తుంది. ఉద్యోగులు అధికంగా సెలవులు తీసుకొనే అవకాశం కలదు. ఇతరులను నమ్ముత కన్నా మిమ్మల్ని మీరే నమ్ముకోండి. మాసముల వారిగా: ఏప్రిల్: చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి.కొంత మేర వివాదముల మూలాన కొంత భాదకులోనవుతారు.  మే: మిశ్రమఫలితాలను పొందుతారు మనోదైర్యంతో ముందుకువేల్తారు ఒంటరిగానైనా సరే పనిని పూర్తిచేయాలన్న ఆలోచనను కలిగిఉంటారు.గృహమార్పుపైన దృష్టిని పెట్టుటకు అవకాశం కలదు. మొండిగా వ్యహరించుట మూలాన నష్ట పోతారు. జూన్: మొండితనాన్ని విడనాడండి వాయిదాలవిధానంను వీడనాడండి చేసే పనిలో శ్రద్దపెట్టుట మేలు. మీ తల్లితండ్రుల ఆరోగ్యం ఒకింత భాధకు గురిచేస్తుంది. కష్టం మీదకాని పనులు పూర్తికావు. జూలై: ఆడంబారానికి పోవుట చేత ఖర్చులను పొందుతారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు.సమయానికి భ్హోజనం చేయుట అలాగే విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటమనేది సూచన. ఆగష్టు: అకారణంగా మానసికంగా భాదలు పొందుతారు కారణం మీరు ఇతరులనుంచి రావలిసినవి సమయానికి రాకపోవడం జరుగుతుంది.విద్యార్థులకు అతికష్టం మీద పనులు నెరవేరుతాయి. సెప్టెంబర్: అనుకున్న పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు కలుగుతాయి. కొద్దిగా నిదానంగా వ్యహరించండి వ్యతిరేకతలను పొందుతారు తొందరపాటు నిర్ణయాలు వద్దు. అక్టోబర్: ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడుటకు అవకాశం కలదు నిదానంగా వ్యహరించండి.వివాదములు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.నవగ్రహారధన తప్పనిసరి. నవంబర్: వాహనములు నడుపునప్పుడు తగిన జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. కుటుంభంలో సభ్యుల ప్రవర్తన మీకు నచ్చక పోవచ్చును కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. డిసెంబర్: గతమాసం కన్నా కొంత బాగుటుంది కొన్ని ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక వనరులు బాగుంటవి. బకాయులు వాసులు అవుతాయి నూతన నిర్ణయాలు తీసుకోకండి. అదనపు పనులకు దూరంగా ఉంటూ గతంలో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు జనవరి: పనులు ముందుకు సాగకపోయినా ఇబ్బందులు ఉండవు. విశేషవ్యక్తుల పరిచయాలు కలుగుతాయి లాభాని పొందుతారు కాకపోతే మే నిధులను కదిలిస్తారు. అనారోగ్యంను అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. నిరుద్యోగులకు కాస్త ఊరట ఉంటుంది. ఫిబ్రవరి: మీకు నచ్చిన పనులను పూర్తిచేస్తారు మీ ఆలోచనలకు తగిన వ్యక్తులను కలుస్తారు మీ ఆశయాల దిశలో ప్రయాణం సాగుతుంది. విద్యార్థులు కొద్దిగా మీ ఆలోచనల్లో మార్పులు చేసుకోవాలి. మార్చి: ముఖ్యమైన పనులను చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. పనిని ప్రారంభించేటప్పుడు ఆపనికి సంభందించిన రాతకూతలు సరిగ్గా చేసుకొనుట సూచన. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. కలహములకు దూరంగా ఉండటం తప్పదు. పూజలు: విష్ణుసహస్రనామ పారాయణ మేలుచేస్తుంది నవగ్రహ పూజలు చేయండి శనివారాలు రాఘవేంద్రస్వామి గుడికి వెళ్ళండి గాయత్రిదేవిని పూజించుట చేయండి. దత్తాత్రేయ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తాయి 16 గురువారాలు గోమాతకు పచ్చగడ్డి తినిపించండి. దానాలు లేదా జపాలు: శనికి నువ్వులు ధనం ఇచ్చుట జపాలు చేయించుట మేలు రాహువుకు జపాలు మినుములు దానం ఇచ్చుట మేలుచేస్తుంది గురునకు శనగలు దానం ఇచ్చుట జపాలు చేయుంచుట మంచిది. అదృష్ట సంఖ్యలు: 03, 12, 21, 30

మరింత సమాచారం తెలుసుకోండి: