ఆన్ రోడ్ బైక్ రైడింగ్ లో మైలేజ్ తో కూడిన బైక్ ఏదైనా ఉంది అంటే కేవలం బజాజ్ మాత్రమే. ప్రస్తుతం పోటీ పడుతున్న ద్విచక్ర వాగనాల్లో అత్యధిక బైక్ మైలేజ్ తో బజాజ్ ముందడుగేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మోడల్స్ నే కాకుండా కస్టర్మర్స్ కోసం సరికొత్త మోడల్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది కంపెనీ.


ప్రస్తుతం బజాజ్ నుండి వచ్చిన సరికొత్త మోడల్ బజాజ్ వి. బజాజ్ న్యూ వి ఓ సరికొత్త సంచలనంగా ఆటో ఎక్స్ పో 2016లో పొందుపరచబడింది. ఇక బైక్ ప్రయోజనాల విషయానికొస్తే ఎయిర్ క్రాఫ్ట్ కారియెర్ కలిగిన మెటల్ ట్యాంక్ తో వస్తుంది. ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ మోడల్ మార్కెట్ లో కొద్ది సంవత్సరాలుగా అందుబాటులో ఉంది.


ఇప్పుడు అదే బజాజ్ తో కలిసి కొత్త బజాజ్ వి గా రూపుదిద్దబడింది. ఈ బైక్ యొక్క మోడల్ యూరోపియెన్ స్కీబ్లర్ మోడల్ నుండి స్పూర్తి చెందబడింది. ఇక బైక్ విషయానికొస్తే 150సిసి ఇంజిన్ కెపాసిటీతో డిస్కవర్ 150ఎస్, 150ఎఫ్ ల ఇంజిన్ లకు ఉన్న ఇంజిన్ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 5 గేర్ ట్రాన్స్ మిషన్స్ ఉన్న ఈ బైక్ రైడింగ్ చేసే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ బైక్ యొక్క ప్రైజ్ 60వేల నుండి 70 వేల వరకు నిర్ణయించబడింది. మైలేజ్ తో పాటుగా స్టైలిష్ బైక్ కావాలనుకునే వారికి ఈ బైక్ చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: