టూ వీలర్ వాహనాల్లో యమహాను మించిన పిక్అప్ బైక్ వేరేది లేదు అంటే నమ్మాల్సిందే.. కొత్తగా ఎన్ని వెహికల్స్ తమ ఉణికిని చాటెందుకు ప్రయత్నిస్తున్నా పిక్ అప్ స్పీడ్ లో యమహా బైక్ లకు మించింది లేదు. ఇక స్పోర్ట్ బైక్ లో యమ ఈజ్ నెంబర్ వన్ అనాల్సిందే.. ఇక ఇండియన్ మార్కెట్ లో యమహా జర్నీ అదరగొట్టేస్తుంది. 


RD, RX లాంటి జపనీస్ బైక్ లతో సంచలనం సృష్టించిన యమహా ఇప్పుడు మార్కెట్ లోకి సరికొత్త వాహనాన్ని రిలీజ్ చేస్తుంది. 2009లో యమహా నుండి వి.జెడ్.ఎఫ్-ఆర్15, ఎఫ్.జెడ్ సీరీస్ బైక్ స్టార్ట్ అయ్యాయి. ఇక అదే విధంగా యమహా నుండి రే, ఆల్ఫా లాంటి స్కూటర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.   


ఇక స్కూటర్స్ లో కూడా యమహా దూసుకుపోవడంతో యమహా రే జెడ్.ఆర్ ను ప్రెవేశ పెట్టడం జరిగింది. 2016లో ఆటో ఎక్స్ పోలో ఈ సరికొత్త యమహా రే జెడ్.ఆర్ బైక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 110సిసి కెపాసిటీ గల ఈ యమహా ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. 


ప్రస్తుతం తయారీ కాబడ్డ ఈ సరికొత్త యమహా రే జెడ్.ఆర్ స్కూటర్ ఏప్రిల్ 4న మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే యమహా ఆథరైజెడ్ డీలర్స్ అందరికి అందుబాటులో ఈ వాహనాలు ఉంచడం జరుగుతంది. మరి ఇంకెందుకు ఆలస్యం సరికొత్త స్కూటర్ కొనాలనే ఆలోచన ఉన్న వారు ఈ యమహా రే జెడ్.ఆర్ తో ప్రయాణాన్ని సౌకర్యవంతం చేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: