టొయోటాలో సంచలనం సరికొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా మే 3న రిలీజ్ అవబోతుంది. మాన్యువల్, ఆటోమెటెడ్ గేర్ సిస్టెమ్స్ తో ఈ వెహికల్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. డీజిల్ పెట్రోల్ ఇంజిన్స్ తో ఈ వాహనం అందుబాటులోకి వస్తుంది.  


ఇక టోయోటా ప్రయాణీకుల అత్యంత ప్రియ నేస్తం.. కస్టమర్స్ యొక్క ప్రాధాన్యత వాహనం ఇన్నోవా మరింత సొగసులను చేర్చుకుని సరికొత్త రూపంతో ఇన్నోవా క్రిస్టాగా రాబోతుంది. ఇప్పటికే మోడల్ వాహనం రిలీజ్ అయిన ఈ వెహికల్ మే 3న రిలీజ్ చేయనున్నారు.


టొయోటా క్రిస్టా ఇన్నర్ లుక్ :


వాహన రంగంలో సంచలనం సృష్టించిన ఇన్నోవా వెహికల్ సరిగ్గా దశాబ్ధ కాలంగా తన సత్తా చాటుతుంది. ఇప్పుడు అదే రూపంతో సరికొత్త టెక్నికల్ ఫీచర్స్ తో ఈ క్రిస్టా మార్కెట్ లో రిలీజ్ అవుతుంది.12 నుండి 18 లక్షల రూపాయల వెలతో ఇది మార్కెట్ లోకి వస్తుంది.


మే మొదటి వారం నుండి టొయోటా అన్ని ఆధరైజ్డ్ డీలర్స్ దగ్గర ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఈ వెహికల్ ప్రి బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కొత్త వాహనం కొనాలనుకుంటే ఈ సరికొత్త ఇన్నోవా క్రిస్టాతో ప్రయాణం చేసేందుకు సిద్ధం కండి.


మరింత సమాచారం తెలుసుకోండి: