హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సరికొత్త బి.ఆర్-వి వెహికల్ ను లాంచ్ చేసింది. 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనగా ఉంచిన ఈ వెహికల్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు హోండా కంపెనీ వారు. 8.75 లక్షల విలువల కల సరికొత్త బి.ఆర్-వి  పెట్రోల్, డీజిల్ మోడల్స్ తో అందుబాటులో వస్తుంది. డీజిల్ మోడల్ 12.90 లక్షల ప్రైజ్ ఆఫర్ చేస్తున్నారు.  


బి.ఆర్-వి యొక్క ప్రాధాన్యత ఏంటంటే దీనిలో మూడో రో కూడా ప్రయాణీకులు కూర్చోడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడల్ హ్యుండై క్రెటా, రెనాల్ట్ డస్టర్ మోడల్ ను పోలి ఉంటుంది. అంతేకాదు మహింద్రా స్కార్పియో, టాటా సఫారి మోడల్స్ కు గల బ్యాక్ సీట్ ఫెసిలిటీ ఇందులో అందుబాటులో ఉంటుంది.


210మిల్లి మీటర్ల అడుగు భాగం రోడ్ కు తాకే అవకాశం ఉండదు. ఇక ఇందులోని డిస్ ప్లే కూడా మల్టీ ఇంఫర్మేషన్ తో ఇవ్వబడుతుంది. ఇక ఈ 7 సీటర్ బి.అర్-వితో మీ ప్రయాణం సుఖమయం సౌకర్యవంతం అవుతుంది అనడంలో సందేహం లేదు. మీరు కోరుకునే ఫీచర్స్ తో సరికొత్త హోండా బి.ఆర్-వి మార్కెట్ లో రిలీజ్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి మీ కార్ ను బుక్ చేసుకోండి.


ఇక ఈ వెహికల్ హోండా ఆథరైజ్డ్ ఫోర్ వీలర్ డీలర్స్ అందరి దగ్గర త్వరలో అందుబాటులోకి రానుంది. మరి సరికొత్త హోండా బి.ఆర్-వి నుండి కంపెనీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి. ఇప్పటికే దీని అడ్వాన్స్ బుకింగ్ లో సంచలనంగా ఆర్డర్స్ రావడం విశేషం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: