బజాజ్ నుండి వచ్చిన వి 15 బైక్ రీసెంట్ గానే మార్కెట్ లోకి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దాని కంటే దాని యొక్క అమ్మకం అద్భుతంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే 25 వేల దాకా బైకులు అమ్ముడవ్వడం విశేషం. విమాన యంత్రాల్లో వాడే విక్రాంత్ మెటల్ తో తయారు చేయబడ్డ ఈ సేరికొత్త బజాజ్ వి15 రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారు కొనడానికి మక్కువ చూపిస్తున్నారు. 


మార్చ్ 23న లాంచ్ అయిన ఈ సరికొత్త బజాజ్ వి15 అత్యధికంగా అమ్ముడవ్వడం విశేషం. ఇక ఈ 18 నెలల్లోనే 50 వేల బైకులను అమ్మేలా టార్గెట్ పెట్టుకున్నారు నిర్వాహకులు. 149 సిసి కెపాసిటీ గల ఈ బజాజ్ వి బైక్ 62,000 లకు అందుబాటులో ఉంది.  


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఈ బజాజ్ వి బైక్ మీద మోజు పడి ఈ బైకును కొనుక్కోవడం జరిగింది. ప్రయాణీకుల సౌకర్యారధం అన్ని అడ్వాన్సెడ్ ఫీచర్స్ తో టూ వీలర్ రంగంలోనే ఓ సరికొత్త జోష్ ను తీసుకు వచ్చింది బజాజ వి 15 బైక్. మరి ఇంకెందుకు ఆలస్యం సరికొత్త బజాజ్ వి బైక్ ను మీరు కూడా మీ సొంతం చేసుకునేందుకు దగ్గరలో ఉన్న బజాజ్ షో రూం ను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: