సుజుకి మోటార్స్ రీసెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా తమ స్విఫ్ట్ ఉత్పత్తులు 5 మిలియన్ కు చేరుకుందని తెలియచేశారు. జపాన్ కంపెనీ అయిన సుజుకి కస్టమర్స్ ప్రయోజనాలే ముఖ్యంగా బడ్జెట్ కార్ల రంగంలో ముందంజలో నడుస్తుంది. సరిగ్గా దశాబ్ద క్రితం మొదలైన సుజుకి స్విఫ్ట్ ప్రస్థానం నేటికి కొనసాగుతూనే ఉంది.


మార్కెట్ లో ఎన్ని కొత్త రకం కార్లు రయ్ రయ్ అని ఊరిస్తున్నా సుజుకి స్విఫ్ట్ మీద ప్రజల నమ్మకం ఇంకా ఉంది. ఓ చక్కని ఫ్యామిలీ కార్ గా అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతిని సంపాదించింది స్విఫ్ట్.. సరిగ్గా 11 సంవత్సరాల స్విఫ్ట్ కార్ చరిత్రలో ఇదో సరికొత్త చరిత్రకు నాంధి పలికింది.


ముఖ్యంగా దేశ ఆటో మార్కెట్ మీద స్విఫ్ట్ పెను సంచలనం సృష్టించింది.. పోలో, ఐ20 ల మార్కెట్ కన్నా స్విఫ్ట్ కే ఎక్కువ ఉండేది.. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కూడా మంచి సేల్స్ ను ఏర్పరచుకున్నాయి.. కొత్త కారు తీసుకునే ఆలోచన ఉన్న వారు మొదట చూసే కార్ సుజుకి అది కూడా స్విఫ్ట్.. అంత పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ గా భారతదేశంలో పెను సంచలనాన్ని సృష్టించింది స్విఫ్ట్.  ఇక ఇంకా సరికొత్త మోడల్ తో స్విఫ్ట్ సరికొత్త హంగులను పునరుద్దరించుకుని మళ్లీ మార్కెట్ పై తన హవా కొనసాగేందుకు వస్తుంది. ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ కారుగా స్విఫ్ట్ సరికొత్త ప్రభంజనం సృష్టించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: