బజాజ్ అనుసంధానంతో ఐఎన్ఎస్ విక్రాంత్ మెటల్ ద్వారా తయారీ కాబడుతున్న బజాజ్ వి బైకులు రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోనే విశిష్టమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక రిలీజ్ అయిన వి-15 బైక్స్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో సేల్స్ కూడా మంచి ఊపందుకున్నాయి. అయితే ఈ ఉత్సాహంతో బజాజ్ వి నుండి మరో రెండు సరికొత్త మోడల్స్ నవంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.       


బజాజ్ వి15 లైన్ లోనే వి-20, వి-40 మోడల్స్ కూడా తయారు చేయబడుతున్నవి. అన్ని వర్గాల ప్రయాణీకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ వి-15 బైక్ ఇక సరికొత్త మోడల్స్ తో మరింత సౌర్యవంతంగా తయారవుతున్నాయి. ప్రస్తుతానికి 149 సిసితో నడుస్తున్న వి 15 బైక్ త్వరలో రానున్న వి20, వి40లు సిసిలు పెంచబోతున్నట్టు సమాచారం.    


ఇక వి15లో కూడా సరికొత్త కలర్స్ తో ఇప్పుడు మరిన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 62000 ల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తున్న ఈ వి 15 బైక్ బజాజ్ తో అనుసంధానమై మార్కెట్ లో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం నవంబర్లో రిలీజ్ అవుతున్న వి20, వి40ల్లో ఏదో ఒకటి మీ సొంతం చేసుకునేందుకు ఇప్పటి నుండే సిద్ధం కండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: