వోక్స్ వాగన్ నుండి సరికొత్త కార్ చూపరులను ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ తో తమ తమ ఉత్పత్తులను మెరుగుపరచుకున్న కంపెనీలతో వోక్స్ వాగన్ కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు వోక్స్ వాగన్ నుండి సరికొత్త పోలో అందరిని ఆశ్చర్య పరుస్తుంది. నెక్ష్ట్ జనరేషన్ కార్ గా ప్రచారంలో ఉన్న ఈ పోలో కార్ తక్కువ స్పేస్ తో అందుబాటులో ఉంటుంది.  


ఈ సరికొత్త పోలో కార్ ఎం.క్యూ.బి ప్లాట్ ఫాంతో అందుబాటులోకి వస్తుంది. అన్ని వాహనాల్లా దీని యొక్క బ్యాక్ భాగం పొడవుగా కాకుండా కేవలం అతి తక్కువ షార్ట్ రేర్ కటింగ్ తో వస్తుంది. ఇక దీని వలన సీటింగ్ స్పేస్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు కార్ కూడా ఎక్కువ వెయిట్ తో కాకుండా చాలా తక్కువ వెయిట్ ఉండేలా చూస్తున్నారు.  


ఇక ఈ కార్ యొక్క మరో స్పెషాలిటీ ఏంటంటే అన్నిటి కన్నా తక్కువ వీల్ బేస్ అనగా 90 ఎం.ఎం కొలతలతో వీల్ బేస్ ఉంటుంది. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా ప్రయాణీకులకు మరింత కంఫర్ట్ గా ఉంటుంది. మరి రాబోతున్న ఈ సరికొత్త పోలో ఎం.క్యూ.బి ప్లాట్ ఫాం కార్ చూస్తే అందరికి వావ్ అనాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: