ఇప్పటికే ఎన్నో రకాల మోటార్ కంపెనీలతో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుండగా ఇప్పుడు ప్రముఖ ఇంటర్నేషనల్ కార్ల కంపెనీ కియా కూడా భారత దేశంలో తమ ఉత్పత్తులను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి. అవును మరో రెండు నెలల్లో కియా కార్లు దేశంలో విడుదల చేస్తున్నారు. మొదట మూడు రకాల మోడల్ కార్లతో అందుబాటులోకి రానున్న కియా కంపెనీ తర్వాత మిగతా ఉత్పత్తులను తెచ్చే ఆలోచనలో ఉన్నారు.  


గ్లోబల్ గా ఐదవ స్థానంలో ఉన్న కియా ఇప్పుడు దేశ మార్కెట్ పై కన్నేయడం మిగతా కంపెనీల వారికి షాక్ తగిలినట్టు అయ్యింది. గ్లోబల్ గా 3 లక్షల యూనిట్స్ గల కియా కంపెనీ ఇప్పుడు మన దేశ మార్కెట్ పై దృష్టి పెట్టింది. అయితే కియా ఉత్పత్తులు 2019లో అందుబాటులో రానున్నాయి. 


మోడ్రెన్ స్టైల్ తో అప్గ్రేడ్ ఫీచర్స్ తో విడుదలకు సిద్ధంగా ఉన్న కియా మోటార్స్ ఇండియ మార్కెట్ మీద పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నారు. మరి ఇప్పటికే దేశంలో చాలా కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి మరి వాటిలో కియా ఏ స్థానంలో నిలుస్తుందో చూద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: