ఇండియన్ మార్కెట్ లోకి హ్యుండై కంపెనీ మరో కొత్త రకం మోడల్ వెహికల్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. టక్సన్ పేరుతో వస్తున్న ఈ మోడల్ ను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హ్యుండై ఎలంత్రాతో మంచి సేల్ రిపోర్ట్ పొందిన ఈ కంపెనీ నుండి ఇప్పుడు ఈ సరికొత్త టక్సన్ కూడా రిలీజ్ అవబోతుంది.


డి సెగ్మెంట్ వెహికల్ గా రాబోతున్న హ్యుండై టక్సన్ కార్ అత్యంత అధునాతన ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మోడల్ ను 2016 ఆటో ఎక్స్ పోలో ఉంచి అందరి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్ధ్యంతో 136 బి.హెచ్.పి మరియు 373 ఏన్.ఎం తో ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది.


వెహికల్ మొత్తం టచ్ స్క్రీన్ ఇంఫర్మేషన్ తో అందుబాటులోకి వస్తుంది. మరి కొత్త మోడల్ ను ట్రై చేద్దాం అనుకున్న వారికి ఈ సరికొత్త హ్యుండై టక్సన్ మంచి అనుభూతిని ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలో ఉన్న ఆథరైజెడ్ డీలర్ ను సంప్రదించి ఈ వెహికల్ ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: