రాయల్ ఎన్ఫీల్డ్ ఎలెక్ట్రా ఇప్పుడు బుల్లెట్ 350 ఈ.ఎస్ గా మార్కెట్ లో రాబోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లో చీప్ మోడల్ అయిన ఎలెక్ట్రా ఇప్పుడు సరికొత్త నామకరణంతో బుల్లెట్ 350 ఈ.ఎస్ గా వస్తుంది. ప్రస్తుతం యూత్ లో క్రేజ్ ఉన్న రాయల్ బైకులు టూ వీలర్స్ లో రారాజుగా ఉంది. ఎయిర్ కూల్డ్ బైక్ గా రాబోతున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఈ.ఎస్ లో ఎలెక్ట్రాలో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంచడం జరిగింది.


ఇక ఈ వెహికల్ యొక్క మోటార్ కెపాసిటీ విషయానికొస్తే 20పి.ఎస్, 5250 ఆర్.పి.ఎం తో పాటుగా 28 ఎన్.ఎం టార్క్ తో 4000 ఆర్.పి.ఎం కెపాసిటీతో వస్తుంది. ప్రస్తుతం 1.07 లక్షల ధరతో అందుబాటులో ఉన్న ఈ మోడల్ మీ సొంతం చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం కు ఇప్పుడే వెళ్లండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: