ప్రస్తుతం మార్కెట్ లో ఎస్.యు.వి వెహికల్స్ ల హవా కొనసాగుతుంది. అయితే పెద్ద కంపెనీలన్ని వాటి టార్గెట్ ఎక్కువగా పెట్టుకోవడంతో తక్కువ ప్రైజ్ తోనే కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ క్రమంలో మెర్సిడిస్ బెంజ్ కూడా కొత్త జి.ఎల్.సి మోడల్ ప్రైజ్ ను తగ్గించడం జరిగింది.


మార్కెట్ మీద పట్టు సాధించేందుకు కంపెనీలన్ని గట్టి పోటీని ఎదుర్కుంటున్నాయి. అందుకే బెంజ్ జి.ఎల్.సి ప్రైజ్ కస్టమర్స్ ను అందుబాటులో ఉంచేలా ఉంచబడుతుంది. పెట్రోల్ డీజిల్ రెండు మోడల్స్ గా రాబోతున్న ఈ వెహికల్ మోడల్ అధునాతన ఫ్యూచర్స్ తో వస్తుంది. 9 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ 245 పిఎస్, 370 ఎన్.ఎం ఇంజిన్ కెపాసిటీతో వస్తుండగా.. జిఎలెస్ 220 170 పిఎస్, 400 ఎన్.ఎం ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. ఇక ఈ వెహికల్ ధర డీజిల్ 50.9 లక్షలుగా నిర్ణయించగా.. పెట్రోల్ వెహికల్ ధర 47.90 లక్షలు నిర్ణయించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: