మోటార్ బైకుల్లో ఇప్పటికే తన ప్రత్యేకమైన మోడల్స్ తో యువతను ఆకట్టుకుంటున్న యమహా మోటార్ ఇప్పుడు తన కంపెనీ నుండి కొత్తరకం స్కూటర్ ను రిలీజ్ చేస్తుంది. యమహా నుండి రాబోతున్న సరికొత్త స్కూటర్ యమహా ఎన్మాక్స్. యూరోపియన్ స్టైల్ లో మాక్సి స్కూటర్ గా రాబోతున్న ఈ ఎన్మాక్స్ 155 సిసి కెపాసిటీతో రాబోతుంది.

2016 ఆటో ఎక్స్ పోలో చూపరులను ఆకట్టుకున్న ఈ మోడల్ ఈ సంవత్సరం రిలీజ్ కు రెడీ అవుతుంది.  ఇక దీని వెల సుమారు లక్ష రూపాయల దాకా ఉండొచ్చని తెలుస్తుంది. 15 పిఎస్ పరవర్, 14.4 ఎన్నెం టార్క్ తో ఇంజిన్ సామర్ధ్యం కలిగి ఉంది. ఇప్పటికే టెస్ట్ మోడల్ రెడీ అవగా అది ఫైనల్ కాగానే ఈ సంవత్సరం మార్కెట్ లో రిలీజ్ అవుతుంది యమహా ఎన్మాక్స్.  



మరింత సమాచారం తెలుసుకోండి: