బజాజ్ నుండి వచ్చిన పల్సర్ అన్ని మోడల్స్ కన్నా 135 కాస్త సేల్ రిపోర్ట్ లో వెనుకపడి ఉంది. అయితే దీని గురించి ఫైనల్ రిపోర్ట్ తీసుకున్న బజాజ్ కంపెనీ ఇదే బైక్ ను సరికొత్త ఫీచర్స్ యాడ్ చేయనుంది. దీనిలో ప్రత్యేకంగా 6 మార్పులను అప్డేట్ చేసి 2017 ఎండింగ్ కల్లా రీ లాంచ్ చేస్తారట.


ముందు దీని ధరం 5 వేల వరకు తగ్గించాలని నిర్ణయించారట.. బజాజ్ 135 సింగిల్ సీట్ సౌకర్యం కలిగి ఉండేలా చేస్తున్నారు. స్ప్లిట్ సీట్ వల్ల రూరల్ ఏరియాస్ లో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని సింగిల్ సీట్ పెట్టనున్నారట. అంతేకాదు హీల్ షిఫ్టర్ ఫెసిలిటీని కూడా ఉంచుతున్నారు. దీని వల్ల సైడ్ స్టాండ్ చిన్నదిగా అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు కన్నా విండ్ స్క్రీన్ పెద్దదిగా చేసే అవకాశం ఉంది. ఇలా సరికొత్త మార్పులతో బజాజ్ పల్సర్ 135 మళ్లీ మార్కెట్ లో రానుంది. మరి ఈ మార్పులతో పల్సర్ 135 ఏమాత్రం కస్టమర్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: