హీరో మోటో కార్ప్ నుండి సరికొత్త బి.ఎస్-4 ఇంజిన్ ప్రామాణాలతో కొత్త ప్లెసర్ స్కూటీ లాంచింగ్ అవుతుంది. ఆల్వేస్ హెడ్ ల్యాంప్ ఆన్ (ఏ.హెచ్.ఓ) ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్న ఈ స్కూటీ ప్రయాణీకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 102సిసి కెపాసిటీ కల ఈ సరికొత్త ప్లెసర్ 77 కిలోమీటర్ పర్ హవర్ గా పనిచేస్తుంది.


ఐదు లీటర్ల ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ వెయిట్ 101కిలోలు ఉంటుంది. ప్రస్తుతం దీని వెల 65,140 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంటుంది. బి.ఎస్-3 వెహికల్స్ కన్నా కేవలం 1000 రూపీస్ ఎక్కువ మాత్రమే ఈ వెహికల్ అందుబాటులోకి రానుంది. మరి సౌకర్యంగా ఉండి ప్రయాణం సుఖమయం అయ్యేలా సరికొత్త ప్లెసర్ 2017 మోడల్ గురించి మరిన్ని వివరాలు తెలుకోవాలంటే దగ్గరలో ఉన్న హీరో షోరూం కు సంప్రదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: