మహింద్ర అండ్ మహింద్రా కంపెనీ త్రైమాసిక ఫలితాలలో 19.79% మైనస్ లోకి వెళ్లడం జరిగింది. కేవలం 765 కోట్ల వరకే మార్కెట్ చేయగలిగింది. గత సంవత్సరం మహిద్రా 954 కోట్లుగా బిజినెస్ చేయడం జరిగింది. అయితే ఆదాయంలో మళ్లీ కొంతమేరకు లాభం చేకూరేలా చేసుకుంది. 11,942 కోట్ల నుండి 12,335 కోట్లకు మహింద్రా ఆదాయం పెరగడం గమనార్హం. 


జిఎస్టి వల్లే త్రిమాసిక ఫలితాలు ఇలా ఉన్నాయని.. జిఎస్టి ఎఫెక్ట్ తమ కంపెనీ మీద బాగా పడిందని మహింద్రా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాక్టర్ల విషయంలో మహింద్రా సేల్స్ ఎప్పటిలానే మంచి వృద్ధి రేటు కనిపిస్తున్నాయి. కాని మొత్తానికి ఈ ఇయర్ క్వార్టర్లీ సేల్స్ లో మహింద్రా వెనక్కి తగ్గింది.



మరింత సమాచారం తెలుసుకోండి: