టాటా నుండి రాబోతున్న స్పోర్ట్స్ కార్ నెక్సాన్ బుకింగ్ ఈ నెల 11 నుండి స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. దేశీయ కార్ల కంపెనీ అయిన టాటా మోటార్స్ నుండి ఈ సరికొత్త నెక్సాన్ ను సొంతం చేసుకోవాలంటే 11000 లు అడ్వాన్స్ కట్టి బుకింగ్స్ చేసుకోవాలట. టాటా నుండి రాబోతున్న ఎస్.యు.వి విభాగంలో నెక్సాన్ సరికొత్త సంచలనాలు సృష్టించనుంది.


1.2 పెట్రోల్, 1.5 పెట్రోల్ డీజిల్ ఇంజిన్ తో టాటా న్యూ మొడల్ నెక్సాన్ అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ వాహనం యొక్క ధర 7.1 నుండి 14 లక్షల దాకా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ కార్ మారుతి విటారా బ్రెజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హోండా డబల్యు.ఆర్-వి, హ్యుండై క్రెటాలతో పోటీ పడే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: