మహింద్రా అండ్ మహింద్రా మోటార్ కంపెనీ ప్రస్థానం అందులో స్కార్పియోకి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. మహింద్రా స్కార్పియో ఇప్పటికి క్రేజీ వెహికల్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మహింద్రా స్కార్పియోని ఫేస్ లిఫ్ట్ మోడల్ లో రెడీ చేసి మళ్లీ మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. ఈ సరికొత్త మహింద్రా స్కార్పియో ఫేస్ లిఫ్ట్ చూసేందుకు పాత మోడల్ లా అనిపించినా కొత్త అధునాతన టెక్న్లాజీ సెటప్ తో అందుబాటులోకి వస్తుంది.


నవంబర్ 14న మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్న ఈ వెహికల్ సరికొత్త 7 స్లాట్ ఫ్రెంట్ గ్రిల్.. ఎయిర్ డ్యాం కూడా ఇంజిన్ కు ఎక్కువ గాలి వచ్చేలా డిజైన్ చేశారు. ఇక స్పోర్టివ్ ఫ్లాట్ డోర్ ఫెసిలిటీతో వస్తున్న ఈ వెహికల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. 138 బిహెచ్ పి పవర్ తో ఈ వెహికల్ వస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ టెస్ట్ రైడ్ సక్సెస్ అవడంతో మరో మూడు రోజుల్లో దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. మహింద్రా నుండి ఎస్.యు.వి సెగ్మెంట్ లో వస్తున్న ఈ వెహికల్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: