అక్టోబర్ లో మార్కెట్ లోకి రిలీజ్ అయిన మారుతి ఎస్ క్రాస్ మోడల్ వెహికల్ ఆ నెలలో అత్యధిక వాహనాల అమ్మకాల్లో నెంబర్ 1గా నిలిచింది. ఎస్ క్రాస్ ఎస్.యు.వి మోడల్ తో వచ్చిన ఈ వెహికల్ ఇప్పటికే 5510 యూనిట్స్ దాకా అమ్ముడయ్యాయని వెళ్లడించారు. మారుతి నెక్సా షోరూంలో మాత్రమే ఇగ్నిస్, సియాజ్, ఎస్ క్రాస్ లు ఉన్నాయి. 


మార్కెట్ లో రిలీజ్ అయిన ఎస్ క్రాస్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ మారుతి సుజుకి సేల్స్ లో కొత్త ఉత్సాహం తెచ్చింది. మారుతి ఎస్ క్రాస్ మార్కెట్ లో ఉన్న హోండా బీఅర్-వి, రెనో డస్టర్ లకు గట్టి పోటీగా ఏర్పడింది. రానున్న రోజుల్లో ఎస్ క్రాస్ మారుతి సుజుకి ఎస్.యు.వి మోడల్స్ లో నెంబర్ 1గా నిలిచే అవకాశం కనిపిస్తుంది. సేల్స్ లో ఏవి ఉత్సాహం చూపిస్తున్నాయో వాటి ప్రొడక్టుల మీదే మోటార్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: