ప్రతి సంవత్సరం జరుగనున్న ఆటో ఎక్స్ పో కార్యక్రమంలో ఈసారి మారుతి కొత్త రకం మోడల్స్ ను రివీల్ చేయాలని చూస్తుంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 4 లేదా 5 మోడల్ కార్లను మారుతి సుజుకి ఆటో ఎక్స్ పో ప్రదర్శనలో పెట్టబోతుందట అందులో ముఖ్యంగా సుజుకి స్విఫ్ట్ నెక్ష్ట్ జెనరేషన్ మోడల్ ఉంటుందట. 2018 ఆటో ఎక్స్ పో తొలి ప్రదర్శనలో సుజుకి స్విఫ్ట్ కొత్త మోడల్ ప్రదర్శనలో ఉంటుందట. ఇక దీనితో పాటుగా సెకండ్ జెనరేషన్ మారుతి ఎర్టిగా కూడా ఆటొ ఎక్స్ పోలో ఉంటుందట.


ఇక సుజుకి నుండి సియాజ్ వెహికల్ కూడా ఆటో ఎక్స్ పోలో ఉంచుతుంది. సుజుకి సియాజ్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ గా కొత్త ఫీచర్స్ తో ఇది రాబోతుంది. అంతేకాదు ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్లను ప్రదర్శనలో ఉంచబోతుంది. రెనో క్విడ్ కు పోటీగా మారుతి సుజుకి ఈ హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ ప్రవేశపెడుతుంది. ప్యాసింజర్ వెహికల్ గా మారుతి ఇప్పటికే మార్కెట్ లో 40 శాతం ఆక్యుపై చేయగా ఈ సరికొత్త మోడల్స్ తో ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: