మనిషికి ముఖ్యమైన భాగాల్లో ఒకటి కళ్లు..మనం ఎంత అందంగా ఉన్నా కంటి చూపు లేకుండా వ్యర్థమే కదా..!  అయితే మన కంటి కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం..ముఖ్యంగా ఎక్కువగా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లు..ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్లు..తదేకంగా టీవీలు, సినిమాలు చూసే వారికి కంటి వెంటనే ప్రభావం పడుతుంది. ఇక పోతే అతివల కళ్లు కలువ కళ్లలా ఉంటే చాలా అందంగా ఉన్నారు అని అంటారు. అందమైన కళ్ళు మీ అందాన్ని నిబడీకృతం చేస్తాయి.

అందమైన కళ్లు


చక్కటి కలువల్లాంటి కళ్ళు కోసం ఈ చిట్కాలు పాటించండి.


అల్మాండ్ ఆయిల్ లొ కొంచెం ఆలివ్ అయిల్ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు.


గ్లాస్ నిటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి.


ఉప్పు నీటితొ కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి.


రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలిఫ్ లభిస్తుంది.


కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల మీ కళ్ళు ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

 

కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళూ తాజాగా ఉంటాయి.


తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి.


కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.


కళ్ళకు మేకప్ వేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.వీటిపై ఉండే దుమ్ము,ధూళీ వల్ల మీ కళ్ళకు ఇంఫెక్షన్ రావచ్చు.


అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: