మనిషి ఎంత అందంగా ఉన్నా అవి చూడటానికి ముఖ్యంగా కళ్లు ఎంతో ముఖ్యం. మనిషి శరీర భాగాల్లో కళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి వుంటుంది. కొందరికి చిన్న వయస్సులోనే కళ్ల కింద ముడుతలు ఏర్పడి కళావిహీనంగా కనిపిస్తారు.  

కళ్లు ఎంత సున్నితంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయో.. వారి అందం కూడా అలాగే మెరుగుపడుతుంది. పూర్వం కవులు కూడా కళ్లలో దాగి వున్న అందాన్ని ప్రకృతి సౌందర్యాలతో పోల్చి కవిత్వాలను రాసేవారు.  కళ్లు ఒక మనిషి మనసులో వున్న భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తపరుస్తాయి. కాబట్టి ఇటువంటి నేత్రాలకు మార్కెట్లలో లభ్యమయ్యే అనవసరమైన క్రీములను రాసుకోకూడదు. కంటికి ఏవైనా క్రీములు రాసుకుంటే దానిద్వారా ఇన్ఫెక్షన్ అయి కళ్లు పోయే ప్రమాదం వుంది.

అలాగే లెన్సులను వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వుండాలి.  ముఖ్యమైన భాగాల్లో ఒకటి కళ్లు..మనం ఎంత అందంగా ఉన్నా కంటి చూపు లేకుండా వ్యర్థమే కదా..! అయితే మన కంటి కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అందమైన కళ్లు ముఖవర్చస్సును ఇనుమడింప చేస్తాయి. లేకపోతే కళ్లు అస్సలు కనిపించకుండా పోతాయి. అవసరమైతే వైద్య సలహాలను పాటిస్తే మరీ మంచిది.
ఉదయం పూట నాలుగు బాదం పప్పులను అర గ్లాస్ పాలలో నానపెట్టాలి. రాత్రి పూట ఆ బాదం పప్పును ముద్దగా చేసుకొని కళ్ళ చుట్టూ రాస్తే నల్లగా ఉన్న వలయాలు తగిపోతాయి.


అందమైన కళ్లు


కళ్ల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు గ్రీన్ టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు ముంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్ళ కాంతి వంతంగా తయారవుతాయి.

టీ స్పూన్ టమాటో గుజ్జును ,చిటికెడు పసుపు ,అర టీ స్పూన్ నిమ్మరసం , ఒక టీ స్పూన్ శనగ పిండిని తీసుకొని మెత్తగా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని కనురెప్పులపై రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడుక్కోవాలి . ఇలా చేస్తే కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి.

రోజుకు 4 సార్లు ముఖం కడుక్కోవాలి . అలివ్ నూనె , పసుపు పొడి కలిపి ముద్దగా చేసుకొని కళ్ల కింది నల్లని చారల పై రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లని చారలు తొలగిపోతాయి.

విటమిన్ “E ” నూనె తో కళ్ళకింది చారల పై మెల్లగా మసాజ్ చేయాలి. నిద్ర పోయే ముందు కంటి ని రోజూ మంచినీళ్ళుతో శుభ్రం చేయాలి.

అర టీ స్పూన్ కీర రసం లో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకొని అరగంట సేపు ఉంచి ఆతర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.

రోజుకు 6 గంటలు నిద్ర పోవడం వల్ల కళ్ళు చక్కగా కనిపిస్తాయి అని వైద్యులు చెప్తున్నారు.

కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో ముడతలు ఉన్న చోట మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గ్లాస్‌ నీటిలో రాత్రి ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే కళ్లు తాజాగా మెరుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: