మనిషికి అందం ఎంత ముఖ్యమో జుట్టు కూడా అంతే ముఖ్యం. ఎంత అందంగా ఉన్న మగవారైనా, ఆడవారైనా జుట్టు సరిగా లేకపోతే అంద విహీనంగానే కనిపిస్తారు. ముఖ్యంగా ఆడవారికి కేశాలంకరణ అంటే చాలా ఇష్టం. అయితే కాలుష్యం, మారుతున్న వాతావరణం, జన్యు సంక్రమణ, వివిధ రకాల కారణాల వలన జుట్టు రాలటం సాధారణం అని చెప్పవచ్చు.  కొన్ని చిట్కాలను అనుసరించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు.


వెంట్రుకలు, గోళ్ళు, చర్మం అన్ని ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పవచ్చు. సూటిగా చెప్పాలంటే- వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సూచికలుగా వీటిని పేర్కొనవచ్చు. వెంట్రుకల పెరుగుదల ఆరోగ్యంగా ఉంటె, మీరు అందంగా కనపడతారు. ఒకవేళ మీ జుట్టు రాలిపోతుంది అంటే మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారని అర్థం. సాధారణంగా కాలుష్య వాతావరణంలో తిరగటం వలన జుట్టుపై దుమ్ము, ధూళి చేరి, జుట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్'లకు గురవుతుంది అవునా! ఫలితంగా జుట్టు రాలిపోతుంది కావున ఎప్పటికపుడు మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోండి.

అంతేకాకుండా, జుట్టు కడగటానికి గోరు వెచ్చని నీటిని మాత్రమె వాడండి, వెంట్రుకలకు వాడే షాంపూ, నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోండి. షాంపూతో కడిగే సమయంలో, వెంట్రుకల మొదల్లపై మరియు ఫాలికిల్'లపై మీ దృష్టిని కేంద్రీకరించండి. అదేవిధంగా, కండిషనర్ లేదా జుట్టు సంబంధిత లోషన్'లను వాడే సమయంలో జుట్టు కొనలపై దృష్టి సారించండి. ఎప్పటికపుడు సమయానికి అనుగుణంగా, మీ జుట్టు కోనలను కత్తిరించండి. ఫలితంగా, అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, పెరుగుదలలో కూడా మెరుగుపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: