చలికాలంలో ఎక్కువగా మహిళలకు పాదలు పగటడం చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే వారు ఎక్కువగా నీటిలో నానడం వల్ల ఇలా పాదాల పగుళ్ల సమస్యలు వస్తుంటాయి. వాస్తవానికి ఈ పగుళ్లు ఒక్క ఆడవారికే కాదు మగ వారికి ఉన్న సమస్య. చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి… ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


పాదాలు పగుళకుండా ఉండేందుకు చిట్కాలు :


ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.


పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.


పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.


పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.


రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.


కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.


చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు.


షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.


ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోవటం అంత మంచిది కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: