మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్న ఒకోసారి శరీరంలో మార్పలు సంబవిస్తుంటాయి. అధిక బరువు వల్ల అనార్థాలు చేకూరుతాయి. వయసుకు తగ్గ బరువు ఉంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడని చెప్పవొచ్చు. మనం తినే ఆహార పదార్థాలపై కూడా అధారపడి ఉంటుంది. మిత ఆహారం శరీరానికి మంచిది..ఇక జంగ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, వెన్నె శాతం ఎక్కువ ఉన్న ఐటమ్స్ తినడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతుంది.

దీనికోసం మనం తిన ఆహారంలో మార్పు రాకుండా కంట్రోల్ చేసుకొని తింటే అధిక బరవు తగ్గించవచ్చు. చాలా మంది బరువు విషయంలో ఆందోళనలకు గురవుతుంటారు మరియు బరువు తగ్గించుకోవటానికి చేసే ప్రయత్నంలో విఫలం అవుతున్నారు. మనము బరువు తగ్గించికోటానికి చేసే ప్రయత్నంలో, ఆకలి వేసినపుడు తయారు చేసిన ప్రణాలికలను మరచి, ఎక్కువగా తింటూ ఉంటాము. ఇక్కడ మేము తెలుపిన ఆహర పదార్థాలను తినటం మీరు ఆకలి పరంగా సంతృప్తి చెంది, బరువు తగ్గే అవకాశం ఉంది.


అధిక బరువు తగ్గించుకోవడానికి చిట్కాలు : 

గ్రీన్ టీ : బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ ‘పాలీ ఫినాల్స్’లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్’లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది. ప్రతి సారి కప్పు గ్రీన్ తాగినపుడల్లా మీరు మంచి భావనను పొందుతారు. 


నారింజ పండు : బరువు తగ్గించుటలో సహాయపడే మరొక అద్బుతమైన ఆహరంగా నారింజ పండును చెప్పవచ్చు. ఎక్కువ క్యాలోరీలను అందించే డిషెస్’లకి బదులగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ మరియు విటమిన్ ‘C’లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి.


బ్రౌన్ రైస్ : బ్రౌన్ రైస్’ తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, ఎక్కువ మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉంటుంది, మీరు బరువు తగ్గాలి అనుకుంటే బ్రౌన్ రైస్ తినటం వలన రోజంతా ఆకలిగా అనిపించదు మరియు సులభంగా బరువు తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకున్న సమయంలో, ఆకలిచే సమస్యలు ఎదుర్కొన్నపుడు ఈ ఆహారాల ను తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు


సాల్మన్ : శరీర బరువు తగ్గించటంలో సాల్మన్ శక్తివంతంగా పని చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాట్’లను కలిగి ఉంటుంది. శరీర బరువును శక్తివంతంగా తగ్గించే ఒమేగా-3 అనే ఫాటీ ఆసిడ్’ను పుష్కలంగా కలిగి ఉంటుంది. శరీర బరువు తగ్గించుకోటానికి సాల్మాన్ తగిన సహాయాన్ని అందచేస్తుంది.


గుడ్డు : మీ శరీర కండరాల బరువు పెరుగుటకు గుడ్లు మంచి ఆహరంగా చెప్పవచ్చు. ‘లూసియానా స్టేట్ యూనివర్సిటీ’ వారు స్త్రీల పైన పరిశోధనలు జరిపి, రోజు ఉదయాన గుడ్డు, తక్కువ క్యాలోరీలను అనించే టోస్ట్ మరియు జేల్లీలను ఆహరంగా తీసుకోవటం వలన మిగిలిన వారితో పోలిస్తే వారి శరీరంలోని కొన్ని పౌండ్స్’ను త్వరగా కోల్పోయినట్టుగా తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: