ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము అందంగా ఉండాలనే కోరకుంటారు..ఇక దీనికోసం ఎన్నో రకాల ట్రీట్ మెంట్స్, యోగా, ఫేస్ క్రీమ్ లు వాడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  శరీర చర్మంకోసం నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది.  నిమ్మకాయను పలు ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించి వాడుతుంటారు. దీంతో శరీర మేనిఛాయ మెరుగౌతుంది.  చర్మం నల్లగా ఉంటే దానిని రూపుమాపేందుకు పాల మీగడలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని ముఖానికి పూయండి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి.  


మోకాళ్ళు, మోచేతులపైనున్న నలుపుదన్నాన్ని దూరం చేసేందుకు నిమ్మకాయ తొక్కతో రుద్దండి. దీంతో నలుపుదనం తొలగిపోతుంది.  మేని ఛాయను మెరుగుపరచుకునేందుకు టమోటా రసంలో కాసింత పసుపు పొడి కలుపుకుని మీ ముఖానికి పూయండి.


కాసేపయ్యాక చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. దీంతో అందం మరింత రెట్టింపవుతుంది.  ద్రాక్ష రసంలో తేనె కలుపుకుని ముఖానికి పూయండి. దీంతో మీ ముఖారవిందం పెరుగుతుందంటున్నారు బ్యుటీషియన్లు.  

మరింత సమాచారం తెలుసుకోండి: