ప్రతి మనిషి చాలా ఆరోగ్యంగా..సంతోషంగా ఉండాలనుకుంటారు..ముఖ్యంగా మహిళలు చాలా నాజూగ్గా ఉండాలని దానికోసం యోగ,వ్యాయామాలు చేస్తుంటారు.  హెల్దీ డైట్‌ను పక్కాగా ఆచరించడం కష్టంగా మారుతోంది.  డైటింగ్ చేయడం వల్ల అనారోగ్యాల పాలు అవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డైటింగ్ అనేది సరిగా లేకపోతే మరింత బరువు పెరిగేందుకు ఆస్కారముంటుందట. రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేస్తే తప్పనిసరిగా బరువును తగ్గవచ్చాని వైద్యులు సూచిస్తున్నారు.

 చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండొచ్చు:


పగటిపూట మధ్య-మధ్యలో ఆహారాన్ని తీసుకోవాలి. కాని ఇందులో వేపుడు పదార్థాలను మాత్రం తీసుకోవద్దు. బరువు తగ్గేందుకు మరీ విపరీతంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.
 ప్రతి రోజు ఉదయం అల్పాహారం తప్పకుండా తినాలి. దీంతో రోజంతా ఉత్సాహంగా మీ పని మీరు చేసుకునేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది.


ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడిలు లేకుండా దూరంగా ఉండడం మంచింది. ఒత్తిడి కారణంగా కొందరు విపరీతంగా తినేస్తుంటారు. దీంతో బరువు పెరిగిపోవడం ఖాయం. కాబట్టి ఒత్తిడి దరిచేరనీయకుండా మితంగా ఆహారం సేవిస్తుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


ప్రతి రోజు దాదాపు ఎనిమిది నుంచి పది లీటర్ల మేరకు నీటిని సేవించాలి. అదే విధంగా మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీటీలో విటమిన్లు, ఖనిజపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.


ఉదయాన్నే ఒక గ్లాసు మోతాదులో క్యారెట్‌ లేదా టొమాటో రసం తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల శరీరానికి బీటాకెరొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. వీటితో ఆకలి అదుపులో ఉంటుంది. 
కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాల కన్నా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. బరువును తగ్గించడంతో పాటు ఆకలిని అదుపులో ఉంచడంలో ప్రొటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాయామం చేస్తూ ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: