అందం హిందోళం' అంటూ ఏకంగా ఒక 'రాగం'తో పోలుస్తూ, అందం యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పకనే చెప్పారు ఓ సినీ కవి గారు... అందం కోసం మహిళలు మరింత శ్రద్ద తీసుకుంటారు... ఈ విషయం లో పురుష పుంగవులు ఎన్ని కామెంట్స్ చేసినా డోంట్ కేర్ అంటారు... నిజానికి ఇప్పుడున్న సమాజం లో అందంగా కనపడటం ఒక రకంగా కంపల్సరీ అని చెప్పొచ్చు... మగవాళ్ళతో పోటి గా అన్ని రంగాల్లో ఆడవాళ్ళు రాణిస్తున్నారు... మరి ఈ క్రమం లో మహిళలు కట్టు.బొట్టు పై తగిన శ్రద్ద తీసుకోవాల్సిందే...

ఐతే చాలామంది మహిళలకు తమ అందాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలియదు... దీనికోసం బోల్డు డబ్బులు వృధా చేస్తుంటారు... బ్యూటి కోసం కొన్ని ఖర్చులు తప్పకపోయినా, చాలా వరకు ఇంట్లోనే సహజ సిద్దమైన సౌందర్య పోషకాలు ఉంటాయని తెలుసుకోవాలి...

మరి మీ కోసం మేము కొన్ని చిట్కాలు చెప్పేస్తున్నాం...

  • బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయండి... ఈ పేస్టును ముఖం మీద ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కొండి... ఇలా చేస్తూ వుంటే ముఖ కాంతి పెరగడం ఖాయం...
  • అప్పుడప్పుడు మీగడలో తేనెని కలిపి ముఖం, చేతులపై మృదువుగా రాయండి... ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగెయ్యండి...
  • వారానికి ఓ రెండు సార్లు శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయండి... ఎండకు నలుపైన చర్మం మామూలు రంగు లోకి వస్తుంది...
  • సింపుల్ గా చెప్పాలంటే మీ కిచెన్ మీకు ఓ బ్యూటీ పార్లర్ లాంటిదే... టమాటో గుజ్జు, దోసకాయ గుజ్జు అప్పుడప్పుడు అలా అలవోకగా రుద్దేసేయండి... ఇక మీరు మహారాణులు అంతే..!!


మరింత సమాచారం తెలుసుకోండి: