అరటి పండును రోజూ తీసుకుంటే ఎటువంటి జబ్బులు నయం అవుతాయో మీకు తెలుసా అవేంటో మరి చూద్దాం... మలబద్ధకానికి దివ్యౌషధంగా పనిచేసే ఈ అరటి పండును రోజూ రెండు, మూడు ఆహారంగా తింటే.. కిడ్నీ వ్యాధులు, మోకాలి నొప్పి, హై బీపీ, చర్మ సంబంధిత వ్యాధులు కూడా మటుమాయం అవుతాయని వైద్యనిపుణులు అంటున్నారు.  ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే అరటిపండు మానసిక వ్యాధులకు కూడా చెక్ పెడుతుందటున్నారు. భయం, విచారం, ఆందోళన వంటి రుగ్మతలకు అరటిపండు మంచి మెడిసిన్ లా పనిచేస్తుందంటున్నారు. అంతేకాకుండా అరటి పండును గుండె సంబంధిత రోగాలున్నవారు తినవచ్చు.


బ్రెయిన్ కు బలాన్నిచ్చే అరటిపండును... ప్రతిరోజూ రాత్రి ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత తింటే ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, పిత్త వ్యాధులు, మానసిక వేదనలు, మూర్ఛ, మహిళలు ఏర్పడే తెల్ల బట్టను నయం చేస్తుంది. బీపీ సక్రమంగా ఉంటుంది. బలహీనంగా ఉండే పిల్లలకు అరటిపండ్లు ఇవ్వడం మంచిది.


ఇంకా బాగా పండిన అరటి పండులో ఐదు మిరియాల గింజల్ని ఉంచి మరుసటి రోజు తింటే దగ్గు నయం అవుతుంది. అలాగే సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు కూడా అరటి పండు ఉపయోగపడుతుంది. చర్మాన్ని పొడిబారకుండా చేసే అరటి పండు గుజ్జుతో మాస్క్‌, హెయిర్ ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. అరటి పండులో 20-25 వరకు నూనె శాతం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: