మనం ఉదయం లేవగానే నిరహారంగానే అసనాలు వేయటం. యోగసాధన చేయటం ఉత్తమం. ఆరోగ్యాన్ని అనుసరించి రోజుకు రెండు మూడు సార్లయినా ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు అంటున్నారు యోగ గురువులు. ఆసనాలు వేసినా, యోగసాధన చేసిన నేలమీద ఉన్ని రగ్గు కనీ, పలుచటి నూలు వస్త్రం కానీ పరుచుకుని సాధన చేయవచ్చు. పిల్లల అరుపులు, మనుషుల గోల లేకుండా వీలైనంత నిశ్శబ్దంగా ఉండాలంటున్నారు. మనసుకు ఏకాగ్రత చాలా అవసరం ఉంటుంది. ఉదయం గోరు వెచ్చని నీటితో స్నానం చేసిన తరువాతే ఆసనాలు వేయాలి. అలా చేయడం వల్ల శరీర పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మనస్సు కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.


ఇక దుస్తుల విషయానికి వస్తే బిగుతుగా ఉండే వస్త్రాలు ఎప్పుడూ ధరించకూడదు.వదులుగా ఉండే వస్త్రాలే కట్టుకోవాలి. యోగా చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆసనంలోకి ఎలా వెళ్లామో అలానే వెనక్కీరావాలి. మీ ధ్యాన శ్వాస మీద నిలిపి కనులు మూసుకుని నెమ్మదిగా ఆసనం పూర్తి చేయాలి. స్త్రీల విషయంలో మూడు నెలల గర్భిణీ దాటిన స్త్రీలు, అలాగే బహిష్టుకాలంలో ఉన్న స్త్రీలు ఆసనాలు వేయకూడదు. యోగ సాధన చేయకూడదు. దాని వల్ల ఆనారోగ్యం కలుగుతుంది. ‘ప్రాణాయామం’ అంటే శ్వాసని నియంత్రించటం. అసలు ప్రాణం అంటే ఏమిటి ?  కేవలం గాలి. ఈ గాలి శరీరంలో నుండి పోగానే ప్రాణం పోయినట్లు లెక్క అందువలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటమేకాకుండా వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.


శ్వాసకూడా వారి నియంత్రణలో ఉంటుంది. ప్రాణాయామంలో మూడు స్థితులు ఉన్నాయి. అవి పూరకం, కుంభకం, రేచకం, పూరకం అంటే మెల్లగా శ్వాస తీసుకోవడం. -కుంభకం అంటే అలా పీల్చిన శ్వాసను నిలిపి ఉంచటం. -రేచికం అంటే నలిపి ఉంచిన శ్వాసను మళ్ళీ మెల్లగా వదిలి పెట్టడం. ఇలా చేయటమే ప్రాణాయామం. ప్రణాయామం ప్రతిరోజు రోజు చేయగల్గిన వ్యక్తి ఏ విషయంలో నైనా ఏకాగ్రతను, శ్రద్దాభక్తులతోనూ ఉండకలిగుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: