మేకప్ లో మొదట ఫౌండేషన్ తప్పనిసరి, ఫౌండేషన్ మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసేటప్పుడు అంతటా సమరీతిలో ఉండేలా జాగ్రత్త పడాలి. పౌడర్ రూపంలో లభించే ఫౌండేషన్ కంటే లిక్విడ్ రూపంలో లభించే ఫౌండేషన్ మంచిది. శరీరపు ఛాయను బట్టీ ఫౌండేషన్ రంగును ఎంచుకోవాలి. మీ బుగ్గలు అందంగా కనిపించాలంటే బ్లషర్తో బుగ్గలకు రోజ్ అప్లయ్ చేసుకోవాలి. గుండ్రటి ముఖం కలవారు బ్లషర్నీ ట్రషర్ ని ట్రయాంగిల్ షేపులో వాడాలి. కోలముఖం కలవారు బ్లషర్ ని వర్జికల్, హారిజాంటల్ డైరక్షన్ లో అప్లయ్ చేయాలి.


ఫౌండేషన్ అప్లయ్ చేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా వుండాలి. ఫౌడర్ ని అతిగా అప్లయ్ చేయడం మంచిది కాదు. ఎక్సెస్ పౌడర్ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్తో నెమ్మదిగా తుడిచి వేయాలి. కళ్ల కింద నల్లని వలయాలు కనిపించకుండా వుండాలంటే వైట్ కలర్ పౌడేషన్ను అప్లయ్ చేసుకుంటేచాలు, మేకప్ చేసుకునేటప్పడు ఐబ్రోలను సరిదిద్దుకోవాలి.


ఈ విషయంలో చాలా మంది ఐబ్రో పెన్సిల్ ను తీసుకుని లైన్ లాగా దిద్దేస్తారు. కానీ అది సరైన పద్దతి కాదు, మీ కనుబొమ్మల దగ్గర పెన్సిల్ వుంచి ఆపోజిట్ డైరక్షన్ లో అప్లయ్ చేయాలి. అప్పడే ఐబ్రోలు నేచరల్ గా కనిపిస్తాయి. డ్రస్ ని బట్టి లిప్స్టిక్ కాకుండా శరీర రంగుని బట్టి, ముఖానికి వేసుకునే మేకప్ ని బట్టి లిప్ స్టిక్ రంగులుని సెలక్ట్ చేసుకోవాలి. అఫ్లైనర్ ని ఉపయోగించాకే లిప్ స్టిక్ రాసుకోవడం మేలైన పద్దతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: