ముఖం కాంతి విహీనం అవడానికి అంతర్గత, బాహ్య కారణు ఎన్నో ఉంటాయి. పౌష్ఠికాహారం తీసుకుంటూ,వేళకు నిద్ర పోవడంతోపాటు ఈ కింది ఫేస్ ఫ్యాక్స్ వేసుకుంటే డల్ నెస్ తగ్గి ముఖం కాంతివంతమవుతుంది. కొబ్బరి నీళ్ళతో తేనె కలిపి రాస్తే శరీర కాంతి మెరుగవుతుంది. పసుపు కొమ్ము అరగదీసి ఆముదం కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత శెనగపిండితో ముఖం కడుక్కుంటే మంచి ఫలితం వుంటుంది.

టమాటా రసం, నిమ్మరసం, గ్లిసరిన్ ఇవన్నీ ఒక్కో స్పూన్ తీసుకుని ముఖానికి రాసి సున్నీతంగా మసాజ్ చేయండి. పదిహేను తర్వాత చన్నీళ్లతో ముఖం కడిగేయండి. డల్నెస్ పోయి ముఖం ప్రకాశవంతమవుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు ఏమిటో డాక్టర్ ని సంప్రదించి వైద్యంచేయించుకోవాలి. పోషకాహార లోపం అనారోగ్యం లేదా మెడిసిన్ రియాక్షన్ వల్ల కూడా ఇలామచ్చలు ఏర్పడవచ్చు.

కాస్మొటిక్స్ పడకపోవడం వల్ల కూడా మచ్చలు ఏర్పడవచ్చు ఇక మచ్చలు తగ్గేందుకు ఉపయోగించాల్సిన నాచురల్ ఫ్యాక్స్ ఇవి ప్రతి రోజు పాల మీగడ కాని, వెన్న కాని రాసి సున్నిపిండితో ముఖం కడుక్కుంటే మచ్చలు తగ్గుతాయి. చర్మం మీద మచ్చలు ఏవైనా ఉంటే జింక్, కాల్సీయంలు ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: