ప్రతివారు అందరిలో ప్రత్యేకంగా అందంగా ఉండాలనుకుంటారు. అనుకోగానే సరిపోదు. అందానికి అవసరమైన సూత్రాలను కూడా పాటించాలి. అందంగా కనిపించాలనుకునేవారు నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోవాలి. పగలు ఎక్కువగా నిద్రించకూడదు. గృహిణులు మధ్యాహ్నం పూట అరగంట నిద్రపోతే  అలసట పోయిఫ్రెష్ గా కనిపిస్తారు. ఎక్కువగా ఎండబారిన పడకుండా నీడపట్టునే ఉండటానాకి యత్నించాలి. మరి అటువంటి కొన్ని సూచనలు కొన్ని తెలుసుకుందామా... వయసునుబట్టి ఫేస్ ప్యాక్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. తలారా స్నానం చేయడానికి ముందుగా ఆయిల్ బాగా మసాజ్ చేసుకోవాలి. లేదా నిమ్మరసం, పెరుగు, శనగపిండి కలిపి శరీరానికి మర్ధన చేసి స్నానం చేయాలి. అందానికి అదనపు పాయింట్ కేశసౌందర్యం, గోరువెచ్చని నూనెను తలకు పట్టించి వేడినీటిలో ముంచి తీసిన టవల్ నెత్తికి చుట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది.


ఆకు కూరలు, పండ్లు, కూరగాయాల ద్వారా విటమిన్లు లభిస్తాయి. మనకు ఇష్టమైన వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఏ ఒక్కటి తక్కువైన నష్టపడవలసివస్తుంది. రోజు ముఖం కడుక్కునేటప్పుడు చల్లటి నీళ్ళను కళ్ళల్లో చల్లుకుని కడుక్కుంటే కళ్ళు శుభ్రంగా ఉంటాయి. ఈ అలవాటు చూపు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎండలో బాగా తిరిగి ిఇంటిలోకి వచ్చి నప్పుడు కూడా చల్లని నీళ్ళలో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే స్వేదరంద్రాలు పూడుకుపోకుండా ఉంటాయి. అందానికి మరింత అందానిచ్చేవి దుస్తులు : మీ శరీరలావణ్యం, ఎత్తు, లావునుబట్టి అందరికీ నచ్చే డ్రెస్ ను  ఎంపిక చేసుకోవాలి. చదివేటప్పుడు కళ్ళను తరచూ ఆర్పుతూ ఉండడం మంచిది. మస్కారాను తరుచూ వేసుకోవద్దు. అందానికి నవ్వు వెలకట్టలేని ఆభరణం... కోపం వదిలేసి అందరితో కలిసిపోయేలా చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరించాలి.


ఎండకి ముఖం నల్లబారి, పొడిబారి పోయినట్లు జిడ్డుగా ఉంటుంది. ఇలాంటప్పుడు రాత్రిపూట పాలలో బాదం పప్పు నానబెట్టి ఉదయాన్నే మారి దాంట్లో నాలుగైదు చుక్కల నిమ్మరసం, అరచెంచా గ్లిజరిన్ కలిపి ముఖానికి పట్టించండి. అరగంట తరువాత నీటితో కడిగితే ముఖం తేమగా నున్నగా ఉంటుంది. రోజూ శాండల్ సబ్బుతో నాలుగైదు సార్లు ముఖం కడిగితే తేమగా నున్నగా ఉంటుంది. రోజూ శాండల్  సబ్బుతో నాలుగైదు సార్లు ముఖం శుభ్రం పరుచుకోవాలి. తీపి పధార్థాలు, నూనె ఎక్కువగా ఉండే వంటకాలు, కేకులు ఫీజాలు లాంటి తినుబండారాలకు దూరంగా ఉండటం మంచిది. జిడ్డు ముఖాన్ని కడుక్కోకుండా దానిపైనే క్రీములు పౌడర్లు రాయకూడదు. కొంచెం దూదిని హైడ్రోజన్ ఫెరాక్సుడ్ లో ముంచి నుదురు, మెడకింది భాగంలో తుడిస్తే చెమట వల్ల పట్టిన మురికిపోతుంది. జిడ్డు తొలగిపోతుంది.


రోజంతా పని ఒత్తిడిలో అలసిపోయిన కనులకు విశ్రాంతినివ్వాలంటే దోసకాయ ముక్కలను గుండ్రంగా కోసి ఫ్రిజ్ లో పెట్టి ఆ ముక్కలను కళ్ళపై పెట్టుకుని రిలాక్స్ అవ్వండి. దోసకాయ గుజ్జులో కాస్త నిమ్మరసం చేర్చి ఎండమూలంగా ఏర్పడిన మచ్చలపై రాస్తే నలుపు తగ్గి చర్మం బిగువు కోల్పోకుండా ఉంటుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నప్పడు కీరా గుజ్జులో వేపాకు, తులసి ఆకులు వేసి మెత్తగా రుబ్బి ఆ గుజ్జుని రోజూ రాసుకుంటూ క్రమం తప్పకుండా రాస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని మనం కాపాడుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: