ఈ మద్య మనిషి తన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల టిప్స్ వాడుతున్నారు. ముఖ్యంగా ఆడవారు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి జిమ్, బ్యూటీ పార్లర్, యోగా లాంటి ఫాలో అవుతున్నారు. అయితే అందాన్ని మెరుగుదిద్దే అద్భుతమైన ఆహార పదార్ధలు మనకు అందుబాటులో ఉన్నాయి.  పురాణ కాలం నుంచి ఆరోగ్యం, అందం కాపాడుకోవడాని   పండ్లు, కాయగూరలు, గింజలు, కందమూలాలు, మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా రుతువుల్లో మనకు లభించే పండ్ల తినడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి. చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.


రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. కెలొరీలు, నీరు శాతం తక్కువగా ఉండే కీరదోస అందానికి, ఆరోగ్యానికి, కేశ సంరక్షణకూ చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం: కీరదోసలో ఖనిజలవణాలు ఎక్కువ. సలాడ్‌ గానే కాదు సూప్ గానునూ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడే వారికి, ఎసిడిటి, కీళ్ళనొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. కీరదోసలో విటమిన్‌ సి, పీచు, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. అవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.


చర్మం మెరుగుదల : ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితి ని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది.


 1. కీరదోస తురుమును ముఖానికి రాసుకుంటే చర్మంపై జిడ్డు పోతుంది. మొటిమలు, నల్లమచ్చలు దూరమవుతాయి.


2. కీరదోస రసానికి నిమ్మరసం, రోజ్‌వాటర్‌, కలిపి ముఖానికి రాసుకుంటే, చర్మానికి నిగారింపు వస్తుంది.


3. రెండు చెంచాల కీరరసానికి చెంచా పాలు, రోజ్‌ వాటర్‌ చేర్చి.. ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే, మృతచర్మం తొలగిపోతుంది. జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌ , సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: