మాయిశ్చరైజర్ సన్ స్ర్కీన్ లోషన్ వంటి తప్పనిసరిగా వాడాలని చెప్తున్నా చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరేమో సన్ స్ర్కీన్ లోషన్ అంటే కేవలం వేసవి కాలంలో మాత్రం ఉపయోగిస్తే చాలనుకుంటారు. ఇది చాలా పొరపాటు. కాలంతో సంబంధంలేకుండా ఇంట్లోంచి కాలు బయట పెట్టినప్పుడుల్లా సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి.  సన్ స్ర్కీన్ లోషన్ ఒక్క వేసవికాలంలో మాత్రమే ఉపయోగించాలి అనే అభిప్రాయం మీలో ఉంటే దానిని మార్చుకోండి. ప్రతిరోజూ ఉపయోగించడం మొదలుపెట్టింది. సన్ స్క్రీన్ లోషన్ టెక్నిక్స్ చూద్దాం..   పాతవి వాడద్దు   ఏదైనా క్రీమో, లోషనో కొన్నామంటే రోజుల తరడబడి ఉపయోగిస్తుంటారు కొందరు. మందులకు అయితే ఎక్స్ష్ఫైర్ డేట్ ఉంటుందో కాస్మోటెక్స్ కూడాఫలానా టైం లోపల ముగించాలని ఉంటుంది. సన్ స్ర్కీన్ లోషన్స్ విషయానికి వస్తే మీరు కొని సంవత్సరం దాటితే ఇక ఆ బాటిల్ ఉపయోగించపోవడమే మంచిది. పర్వాలేదు లెమ్మని సర్దుకుపోతే చర్మ సంబంధిత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.     


ముఖానికి మాత్రమేనా   ముఖానికి లోషన్? పేరుకు తగినట్లు సూర్యుని నుండి వెలువడే హానికారక కిరణాలకు మన చర్మానికి మద్య ఒక స్ర్కీన్ లాగా పనిచేస్తుంది. తద్వారా సన్ స్క్రిన్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు జాగ్రత్తపడవచ్చు. కాబట్టి ముఖంతో పాటు మెడ, చేతులకు కూడా రాసుకోవాలి. స్కర్ట్లులు మినీలు వేసుకునేవార కాళ్ళకు కూడా రాసుకుంటే మంచిది. ముఖ్యంగా కనుబొమలు, పెదవులు, ముక్కు దగ్గర కొంచెం ఎక్కువగా అప్లై చేయాలి.   ముఖం కడుక్కున్న ప్రతిసారీనా...?   అవును ముఖం కడుకున్న ప్రతిసారీ సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి. అలాగే చెమట పట్టినప్పుడు ముఖం తుడుచుకుంటాం కదా! అప్పుడు కూడా మరోసారి లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసులకు వెళ్లేవారు, మార్కెటింగ్ వంటి వృత్తిలో ఉన్నవారు బ్యాగ్ లో సన్ స్ర్కీన్ లోషన్ బాటిల్ పెట్టుకోవడం మంచిది.

  ఎంత రాసుకోవాలి?   మనం ఏం చేస్తామంటే బాటిల్ లోంచి కొంచెం చేతిలో వంపుకుని ముఖం మీద చుక్కలుగా పెట్టి ఆ తర్వాత సరిచేస్తాం. ఇది సరైన పద్దతే. అయిలే సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే విషయంలో పొదుపు పాటించకండి. శుభ్రంగా ఒక టీస్పూనులోకి లోషన్ తీసుకుని ముఖానికి రాసుకోండి, ఆ తర్వత మరో టీస్పూన్ లోషన్ లోకి తీసుకుని మెడకు, చేతులకు రాయండి. టీస్పూన్ తీసుకుని ప్రతిసారీ కొలవమని కాదు. ఉజ్జాయింపున ఒక టీస్పూను లోషన్ తీసుకుని ఉపయోగించాలని అర్థం.  ముఖానికి మాత్రం రాసి వదిలేకుండా సన్ స్ర్కీన్ లోషన్ మెడకు కూడా తప్పకుండా రాసుకోండి. ఎందుకంటే వయసు ప్రభావము ముందుగా తెలిసేది మెడ దగ్గరే కాబట్టి ఆ ప్రాంతంలో కూడా తప్పకుండా సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి.     మాయిశ్చరైజర్ కూడా...   సన్ స్ర్కీన్ లోషన్ రాసుకున్నంత మాత్రాన మాయిశ్చరైజర్ రాసుకోవడం మానేక్కర్లేదు.

ముందుగా మాయిశ్చరైజర్ రాసుకుని ఆపైన సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి.     తప్పనిసరై ఎండలో బయటకు వెళ్తుంటే     ఉదయం పడుకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మద్య ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా ఉండాలి. ఒక వేళ తప్పనిసరై బయటకువెళ్లాల్సి వస్తే టోపి పెట్టుకోవమే వెంట గొడుగు తీసుకువెళ్లడమో చేయాలి. అలాగే మంచినీళ్ళు బాగా తాగడం అలవాటు చేసుకుంటే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.     సన్ స్ర్కీన్ బామ్ ప్రస్తుతం మార్కెట్ లో సన్ స్క్రీన్ లిప్ బామ్ లు కూడా లభిస్తున్నాయి. ఇవి అంత తడిగాను అతుక్కుపోయినట్టుగాను ఉండవు. పెదవులకు రాసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే తప్పనిసరిగా సన్ స్ర్కీన్  లోషన్స్ వాడటం అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: