సాధారణంగా సొసైటీలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే చూస్తారు..అయితే కొంత మందికి పుట్టుకతో అందంగా పుడతారు..మరికొంత మంది అందం కోసం మెకప్, బ్యూటీ పార్లర్లు ఆశ్రయిస్తారు. అయితే మనం తినే  ఆహారంపై కూడా అందం అధార పడి ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. ముఖ్యంగా శరీరంలోని రంగు బాగా నలుపు ఉన్న వారికి కాకుండా చామన చాయ ఉన్న వారు కాస్త తెల్లగా కనిపించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంటారు.   తెలుపు మనకు సహజసిద్దంగా రావాలంటే ఏమి చెయ్యాలి? ఎలాంటి కూరగాయలు వాడాలి వంటివి తెలుసుకొని పాటించడం వల్ల మంచి ఫలితాలను సాధించచ్చు. కొన్ని రకాల కూరగాయలు విటమిన్, ఎంజైమ్ లను కలిగి ఉండి, చర్మాన్ని శుభ్రపరచి, సమతుల్యపరుస్తాయి.  అలాంటి పదార్థాలు మనకు నిత్యం అందుబాటులోనే ఉంటాయి. 

చర్మ సౌందర్యాన్ని పెంపొందించే కూరగాయలు....

రోజు తినే ఆహారంలో క్యారెట్ ను కాలటం వలన క్యారెట్ విటమిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ (కెరోటినాయిడ్) లతో నిర్మితమై ఉంటుంది. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, క్యారెట్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.


క్యాబేజీ ని నీటిలో కలిపి వేడి చేసి చర్మానికి వాడటం వలన చర్మం తాజాగా, మెరుగ్గా అవుతుంది. ముఖ్యంగా కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలను సమర్థవంతమగా తగ్గిస్తుంది.


ముఖ్యంగా, జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్న వారికి అద్భుతంగా పని చేస్తుంది. బంగాళదుంప రసాన్ని చర్మానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేయండి. అంతే కాదు చర్మంపై ఉండే మచ్చలు మరియు నల్లటి వలయాలను తగ్గించుటలో బంగాళదుంప ప్రాధాన పాత్ర పోషిస్తుంది. 


టమోటాను రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవడం తో మంచి చర్మాన్ని పొందవచ్చు. అంతేకాదు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని, ఒక చెంచా టమోటా రసంలో కలిపి ముఖానికి పట్టించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.


దోసకాయ రసాన్ని నిమ్మతో కలిపి ముఖానికి పట్టించడం ద్వారా మెరుగైన చర్మాన్ని పొందవచ్చు. అలాగే దోసకాయ రసాన్ని ముఖానికి పూసి, ఎండే వరకు ఉంచి గోరు వెచ్చని నీటితో కడగటం ద్వారా మెరుగైన మరియు ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా, ఇది మీ చర్మ కణాల నిర్మాణాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: