ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు..ఇది అక్షరాలా నిజం. ఉల్లితో ఎన్నో లాభాలు ఉన్నాయి..అందుకే మనం ప్రతి నిత్యం ఏదో రకంగా ఉల్లి ఉపయోగిస్తుంటాం. ఉల్లి కేవలం వంటకాల్లోనే కాకుండా చక్కటి ఔషదంగా కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా..! ప్రస్తుత కాలంలో అందంగా ఉండడం కోసం, అందంగా కనిపించడం కోసం చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో స్త్రీ, పురుష బేధం లేదు.  శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు. కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసిన అల్లిసిన్‌ను ప్రయోగశాలలో పరీక్షించిన శాస్త్రవేత్తలు.. అల్లిసిన్ రసాయన చర్య కారణంగా విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యే సల్ఫేనిక్ ఆమ్లం శరీరంలోని రాడికల్స్‌పై త్వరితగతిన ప్రభావం చూపుతున్నట్లుగా గుర్తించారు.

ఈ మేరకు వెల్లుల్లిలోని ఔషధ గుణాలకు, సల్ఫేనిక్ యాసిడ్ ప్రభావానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లుగా వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన వెల్లుల్లిపాయలను సంప్రదాయ వంటకాలన్నింట్లోనూ విరివిగా వాడుతుంటారు.

వెల్లుల్లిలో రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కర్బన రసాయనం అయిన అల్లిసిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటాక్సిడెంట్‌గా అల్లిసిన్ చెలామణిలో ఉంది.


ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర ఏవైనా ఆయిల్స్ ను కలిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢమై వెంట్రుకలు బలంగా, కాంతివంతంగా ఉంటాయి.

ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే కొన్ని ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ను తల కుదుళ్లకు తగిలేలా రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలపై ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి.

ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటి నుంచి తీసిన రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కూడా కాంతివంతమవుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: