మనిషి అందంగా ఉండాలని పదిమందిలో తానే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఎంత ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అందంగా లేకపోవడం అనేది శాపంగానే భావిస్తారు. అయితే సహజసిద్దంగా అందంగా ఉండేవారు కూడా చాలా అరుదుగానే కనిపిస్తారు. అయితే అందంగా ఉండేందుకు ఆహరంతో పాటు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు కూడా ఎంతో తోడ్పడతాయి.   ప్రకృతిలో లభించే మూలికలతో, చెట్లతో ఎన్నో వ్యాధులను దూరం చేసుకునే అవకాశం మానవునికి లభించింది. ఇందులో కలబంద ఒకటి. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్‌, ఎంజైమ్స్‌, మినరల్స్‌ల మిశ్రమం కలబంద.

రోజూ కలబందను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి బలపడుతుంది. తద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అలొవెరాను జెల్‌, జ్యూస్‌, పిల్స్‌ టాబ్లెట్స్‌ రూపంలో తీసుకోవచ్చు. ఇంకా కలబందతో ఏమేమి ప్రయోజనాలో తెలుసుకుందాం. చూడటానికి ముళ్ళ మొక్కలా ఉంటుంది. అలోవెరా జెల్ ఉపయోగాలు అన్ని ఇన్ని కావు . చర్మ సంరక్షణ విషయంలో ఇది అద్భుతంగా పని చేస్తుందంటారు సౌదర్యనిపుణులు. చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అలోవెరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. పోడిచర్మంతో బాధపడేవారు తరుచుగా అలోవెరా ఆయిల్ రాస్తుంటే చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది.   


శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడానికి కలబంద ఉపయోగపడుతుంది. రక్తం సరఫరాను మెరుగుపరిచే గుణం దీనిలో ఉంది. రక్తనాళాలు సాఫీగా ఉండేలా, రక్తకణాలు వృద్ధి చెందేలా చేయడంలోనూ కలబంద ఉపకరిస్తుంది.


ముడతలను నివారించడమే కాకుండా మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే స్ట్రెచ్‌ మార్క్స్‌ను పోగొట్టడానికి ఉపకరిస్తుంది. చర్మం యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడే కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌ ఉత్పత్తి కావడానికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. 


చర్మంపై ఉండే సిబేషియస్‌ గ్రంథులు నూనెతో కూడుకుని ఉంటాయి. వీటి సూక్ష్మరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఉబ్బి మొటిమలుగా మారుతాయి. రోజూ అలొవెరాను తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడటమే కాక రక్త సరఫరా మెరుగుపడుతుంది. తద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి. 
 
చర్మం ఎరుపెక్కడం, రేడియేషన్‌ మూలంగా దెబ్బతిన్న చర్మానికి అలొవెరా జెల్‌ బాగా పనిచేస్తుంది. స్కిన్‌ రాషెస్‌, హెర్పిస్‌ సింప్లెక్స్‌, మొటిమలు, రింగ్‌ వార్మ్‌ తదితర చర్మవ్యాధులకు కలబంద మంచి ఔషధం. చర్మంపై వచ్చే నల్లమచ్చలను ఇది పోగొడుతుంది. సోరియాసిస్‌ గజ్జిలాంటి చర్మవ్యాధులను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: