అందం విషయంలో కాస్త తేడా వచ్చినా అస్సలు ఒప్పుకోరు అమ్మాయిలు. ముఖ్యంగా ముఖంలో నల్లమచ్చలు, మొటిమలు వంటి విషయంలో హైరానా పడిపోతుంటారు. అలాంటప్పుడు ముఖంలో ముడుతలు లేదా చారలుంటే ఇక అంతే.. వయసైపోయినవారిలా కనబడుతామోనన్న కంగారు మొదలువుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్, సన్ టాన్ వంటి సమస్యలు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్నాయి..

 

మొటిమలు, బ్లాక్ హెడ్స్, సన్ టాన్ వంటి సమస్యలకు ఇంట్లోనే లభించే అద్భుతమైన సొల్యూషన్‌కొబ్బరి నూనె. ఇది ముఖంపై వచ్చే ముడుతలను మాయం చేస్తుందని చెప్తున్నారు స్కిన్‌ఎక్స్‌పర్ట్స్‌, బ్యుటీషియన్స్‌. సాధారణంగా ముఖంలో ముడుతలనేవి నుదురు, కళ్ళ చుట్టూ, పెదాల చుట్టూ ఏర్పడుతుంటాయి. ఎంత అందంగా ఉన్నా ఈ సర్కిల్స్ వల్ల అందమంతా పాడవుతుంది. కాబట్టి ముఖంలో ముడుతలను మాయం చేసి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం కొబ్బరి చాలా బాగా సహాయపడుతుంది. కోకొనట్‌ఆయిల్‌స్కిన్‌ను సాఫ్ట్ గా చేస్తుంది. ఫేస్‌పై ఉండే ముడుతలను మాయం చేస్తుంది. రోజులో రెండు సార్లైనా కొబ్బరి నూనెతో ముఖం మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే జిడ్డు చర్మతత్వం ఉన్న వారు కొబ్బరి నూనెను అప్లై చేయకపోవడం మంచిది. కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది.

 

కోకొనట్‌ఆయిల్‌ను అప్లై చేసేటప్పుడు ఫస్ట్‌ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముడుతలున్న ప్రదేశంలో డస్ట్, మేకప్ లేకుండా పూర్తిగా తొలగించడం కోసం చల్లటి నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. మీరు ఎక్కువగా మేకప్‌వేసుకుంటున్నట్లయితే చర్మం మీద మొదటి లేయర్‌గా ఉండే మేకప్ తీసేసి, ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ముడుతలున్న ప్రదేశంలో సున్నితంగా మర్ధన చేయాలి. ఇది చర్మంలోకి వెళ్లి ముడతలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా నైట్‌పడుకునే ముందు ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ కండరాలకు విశ్రాంతి పొంది, రక్తప్రసరణ మెరుగుపడి ముడుతలు మాయం అవుతాయి.

 

కొబ్బరి నూనె అప్లై చేసే రోజుల్లో ముఖానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయకపోవడమే మంచిది. కొబ్బరి నూనె ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను నివారించడం వల్ల ముఖంలో ముడుతలను సులభంగా తొలగించుకోవచ్చు. కళ్ళ క్రింద ఉబ్బు, చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల కళ్ళ క్రింది క్యారీ బ్యాగులను నివారిస్తుంది. చర్మంలో మొటిమలు, మచ్చలున్నా తొలగిస్తుంది.  ఇంకెందుకాలస్యం ఇంట్లోనే లభించే కొబ్బరినూనెను ఉపయోగించి మీరు కూడా మీ ముఖంపై వచ్చిన ముడతలను సులభంగా తొలగించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: