వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు.. మహిళల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా.. ఈ కాలాల్లో మహిళలకు జుట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. జుట్టు చిక్కుపడటం, డ్రై అవడం, చిట్లిపోవడం, బ్యాక్టీరియా, చుండ్రు, ఫంగస్, ఇన్ఫెక్షన్స్ పెరగడం వంటివి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యలతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Image result for dandruff

జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు వర్షాకాలం, చలికాలంలో జుట్టు సంరక్షణ చాలా అవసరం. జుట్టుకి ఎలాంటి సమస్య ఉందో ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా అవసరం. చాలా మంది ఈ కాలాలలో చేసే పొరపాట్లు, అజాగ్రత్తలు కురుల సౌందర్యంపై మరింత ప్రభావం చూపుతున్నాయి.

Image result for dandruff

25ఏళ్ళలోపు జుట్టు రాలడానికి గల ముఖ్యమైన ఆరోగ్య కారణాలు హెయిర్ డ్యామేజ్ అవడానికి ప్రధాన కారణం విటమిన్స్, ప్రొటీన్స్ తక్కువవడమే. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. దాంతోపాటు జుట్టు సంరక్షణకు వాడే షాంపూలు, కండీషనర్ల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. వీటితో పాటు సాధారణంగా ప్రతి ఒక్కరు చేసే పొరపాట్లేంటో ఒకసారి చూద్దాం. ఎలాంటి పొరపాట్లకు దూరంగా ఉంటే.. జుట్టు ఆరోగ్యంగా.. నిగనిగలాడుతూ ఉంటుందో తెలుసుకుందాం.

Image result for dandruff

జుట్టు విషయంలో కామన్ గా చేసే పొరపాట్లు 1/10 రోజూ తలస్నానం వారానికి రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. కానీ అంతకంటే ఎక్కువగా హెడ్ బాత్ చేస్తే.. జుట్టు సహజత్వాన్ని కోల్పోతుంది. తడిజుట్టుతో చేసే పొరపాట్లు తడిజుట్టుని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. తేమను ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి.. అప్పుడు తలలో దువ్వెన పెట్టకపోవడం మంచిది. వేడి నీళ్లు జుట్టు డ్యామేజ్ అవడానికి అందరూ చేసే

కామన్ మిస్టేక్ వేడినీళ్లు వాడటం. అంటే గోరువెచ్చని నీళ్లు వాడితే మంచిదే కానీ.. చాలా ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్లు తలస్నానానికి వాడకూడదు. దీనివల్ల జుట్టు డ్రైగా, వీక్ గా మారుతుంది.


హెయిర్ డ్రైయర్స్ జుట్టు ఆరబెట్టుకోవడానికి వాడే హెయిర్ డ్రైయర్లకు దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల జుట్టు చిట్లిపోతుంది. హెయిర్ స్ర్టెయిటినింగ్ కి, కర్లీ జుట్టుకు వాడే ప్రొడక్ట్స్ కూడా జుట్టుకి హాని కలిగిస్తాయి. పార్లర్లకి వెళ్లడం రెగ్యులర్ గా పార్లర్ కి వెళ్లడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. వాడివల్ల కలిగే వేడి గాలి వల్ల.. జుట్టు సహజత్వాన్ని కోల్పోయి.. జుట్టు పొడిగా మారిపోతుంది.


కండిషనర్ షాంపూతో జుట్టుని శుభ్రం చేశాక కండిషనర్ వాడటం మర్చిపోకూడదు. మీ జుట్టు సాధారణంగా పొడిగా ఉంటే.. కండిషనర్ తప్పనిసరిగా వాడాలి.. లేదంటే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. పొడిగా మారిన జుట్టుని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన టైంలో శ్రద్ధ తీసుకున్నప్పుడే.. జుట్టు ఆరోగ్యంగా.. ఒత్తుగా ఉంటుంది.


హానికరమైన ఉత్పత్తులు జుట్టుకి వాడటం వల్ల.. అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆల్కహాల్ ఉండే ఉత్పత్తులు వాడకూడదు. వీటివల్ల.. స్కాల్ఫ్ కి, కుదుళ్లకి హాని కలుగుతుంది. జుట్టుని పదే పదే ముట్టుకోవడం జుట్టుని మాటిమాటికి ముట్టుకుంటూ ఉండటం మంచిది కాదు. దీనివల్ల జుట్టు పొడిగా, చిక్కులుపడుతుంది. ముఖ్యంగా తలస్నానం అయ్యాక తడిజుట్టుని ముట్టుకోకూడదు. అవి సహజంగా ఆరిపోయేలా జాగ్రత్త పడాలి.


దువ్వెన విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. దువ్వెన చాలా క్లీన్ గా ఉండాలి. అది శుభ్రంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు.. చిక్కు తీసుకోవడానికి వాడే దువ్వెన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే.. జుట్టు చిట్లిపోతుంది. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు ఎంతో ఒత్తుగా, ఆరోగ్యంగా.. నల్లటి కురులతో నిగనిగలాడుతోంది. మీరు వీటిని ట్రై చేసి మీ జుట్టును అందంగా ఉంచుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: