బ్లాక్ టీతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్స్. మ‌రి అవేంటో ఓ సారి చూద్దాం. బ్లాక్ టీని త‌యారు చేయ‌డానికి ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. దీన్ని మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇతర టీలతో పోల్చితే బ్లాక్ టీ చాలా మంచిది. సాధార‌ణ టీతో పోల్చితే బ్లాక్ టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. లెమ‌న్ టీ, గ్రీన్ టీ, లేదా వైట్ టీలతో పోల్చితే, బ్లాక్ టీలో ఆక్సిడేషన్ క్వాలిటీస్ ఎక్కువ. అయితే బ్లాక్ టీలో కెఫిన్ ఎక్కువ. 


ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందడం కోసం ఎక్కువగా బ్లాక్ టీని ప్రిఫర్ చేస్తుంటారు హెల్త్ అడ్వైజ‌ర్స్‌. ఈ బ్లాక్ టీలో అమేజింగ్ హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి. మ‌న‌దేశంతో పాటు చైనాలో బ్లాక్ టీని ఎక్కువగా ఉపయోగిస్తునారు. ఈ టీ కలర్ నేచర్ వల్ల బ్లాక్ టీని రెడ్ టీగా భావిస్తారు. ఈ టీ ని ఎక్కువగా అస్సామ్, వెస్ట్ బెంగాల్ ప్ర‌జ‌లు ఎక్కువగా తీసుకుంటారు. ఇంటర్నేషనల్ కేఫ్ లో కూడా మన ఇండియన్ టీనే ఎక్కువగా ఇష్టపడతారు. బ్లాక్ టీ మనకు కమ్మని రుచిని, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందివ్వడం మాత్రమే కాదు. బ్యూటీ కోసం కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు .


 బ్లాక్ టీని బ్యూటీ కోసం.. ముఖ్యంగా హెయిర్ కేర్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది తెల్ల జుట్టును నివారిస్తుంది. నేచురల్ హెయిర్ డైగా ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టును కనబడనివ్వకుండా చేస్తుంది. కొద్దిగా బ్లాక్ టీ తీసుకుని, నేరుగా జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తెల్ల జుట్టు కనబడనివ్వదు. జుట్టు రాలడం అరికడుతుంది. బట్టతలకు, జుట్టు రాలడానికి ముఖ్య కారణం డీహైడ్రేటోస్టోస్టిరాన్ లేదా డిహెచ్ టి . బ్లాక్ టీలో నేచురల్ డిహెచ్ టి బ్లాకర్స్, ఇది జుట్టు రాలడం తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. 


 బ్లాక్ టీని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టును చిట్లకుండా చేయడంతో పాటు, జుట్టు రాలడం నివారిస్తుంది. బ్లాక్ టీతో తలస్నానం చేయడం లేదా హెయిర్ కండీషనర్ గా అప్లై చేయడం వల్ల, ఇది హెయిర్ కు మంచి షైనింగ్ ఇస్తుంది. షాంపు చేసిన తర్వాత  కొద్దిగా టీ వాటర్ తో తలారా పోసుకోవాలి. ఇది జుట్టులో డల్ నెస్ ను తొలగిస్తుంది. హెల్తీగా...షైనీగా కనబడేట్లు చేస్తుంది. జుట్టు ఎప్పుడూ జిడ్డుగా అనిపిస్తుంటే, బ్లాక్ టీని కండీషనర్ గా ఉపయోగించడం వల్ల తలలో జిడ్డు తొలగిపోతుంది. అలాగే బ్లాక్ టీతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు రిఫ్రెష్ గా మారుతుంది. బ్లాక్ టీ ని హెయియర్ మాస్క్ గా ఉపయోగిస్తే చుండ్రు, దురద వంటి లక్షణాలు గ్రేట్ గా తొలగిపోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: