ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు ఈ చిట్కాను తెలుసుకుందాం... గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

1. అందమైన మోము కోసం పచ్చిపాలతో.. ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు. అదేంటో తెలుసుకుందాం  ఈ చిట్కా లో.. పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి.

ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి... తేడా మీకే తెలుస్తుంది. ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.

2) అందమైన మోము కోసం:  టొమాటో, బీట్రూట్, క్యారట్...సౌందర్య చిట్కా- అందమైన మోము కోసం. ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం ఈ చిట్కా లో.. టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: