సాధారణంగా యుక్తవయసు వచ్చిన వారికి మొటిమల సమస్యలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత అందంగా ఉన్నా కూడా మొటిమలు బాగా వుంటే ఫ్రెండ్స్ మద్య సొసైటీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సమస్య బాగా ఉంటుంది..దీని కోసం రక రకాల ట్రీట్ మెంట్స్, క్రీమ్స్ వంటివి వాడుతుంటారు. మరికొంత మంది ఆయుర్వేద చికిత్స కూడా తీసుకుంటారు. ఏది ఏమైనా మొటిమలు తగ్గించుకునే చిట్కాలు ఇంట్లోనే చాలా ఉన్నాయి.  కొద్దిగా సొంఠి, నాలుగు లవంగాలను తీసుకుని నీటితో మెత్తగా నూరాలి.


ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే వారం రోజుల్లో మొటిమలు తగ్గి పోతాయి. జాజికాయను నీటితో అరగదీసి ఆ గంధాన్ని లేపనం చేస్తే మొటిమలు మాయం నీరుల్లి గడ్డను సగానికి కోసం ఆ ముక్కను మొటిమలపై రుద్దితే అవి తగ్గుతాయి.


బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా, మొటిమలపై రుద్దితే, తగ్గిపోతాయి. కస్తూరి పసుపుకు, నిమ్మరసంతో సాది తీసిన గంధాన్ని కలిపి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: