కొంతమంది చిన్న వయస్సులోనే ఒళ్లు చేసి చూడడానికి పెద్దవారిలా కనిపిస్తుంటారు. దీంతో పదిమందిలోకి వెళ్లాలంటేనే బిడియపడిపోతారు. అయితే పండగలు, ఇతర ఒకేషన్స్‌ సందర్భంగా ఇలా లావుగా ఉన్నవారికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇలాంటి వారికి ఏ డ్రెస్‌ నప్పదు. ఇక చీరల్లోనైతే అస్సలు బాగోరు. చీరల్లో మెరిసిపోవాలంటే పర్ఫెక్ట్ బాడీ షేప్ కలిగి ఉండాలి. అప్పుడే.. కావాల్సిన లుక్ సొంతం చేసుకోగలుగుతారు. పండగలు దగ్గరపడుతున్నప్పుడు అందంపై మరింత దృష్టిపెడుతుంటారు. అలాంటి వారు ఈ కింది టిప్స్‌ పాటిస్తే చాలు హిప్స్, నడుము భాగాలను నాజూగ్గా మార్చుకోవచ్చు.


అందరికీ అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల.. రెండువారాల్లోనే నాజూగ్గా, అందంగా మారిపోవచ్చు. పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ అలాగే ఈ డైట్ టిప్స్ ని మగవాళ్లు కూడా పాలో అవవచ్చు. అదనపు ఫ్యాట్, కార్బొహైడ్రేట్స్ అదనంగా ఉండే ఆహారాలను తీసుకోకుండా కంట్రోల్ చేసుకోవడం వల్ల.. ఫ్యాట్ కరిగించుకోవడం తేలికవుతుంది. 


నాజూగ్గా తయారయ్యేందుకు ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు. అయితే అవన్నీ ఎలా ఉన్నా తక్కువ కార్బొహైడ్రేట్స్ కలిగిన అవకాడోను.. ఫ్యాట్ తగ్గాలి అనుకునేవాళ్లు తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఇది.. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాంతో పాటు తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే క్యారట్స్.. ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే.. కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది. సరైన విధంగా క్యారట్స్ తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. హిప్స్ చుట్టూ, నడుము చూట్టూ ఉండే ఫ్యాట్ ని కరిగించుకోవాలనుకుంటే మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్ ని పెరుగు ద్వారా పొందడం వచ్చు. అయితే తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగునే తీసుకోవాలి. బీన్స్ ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండే.. బీన్స్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. అది కూడా బరువు తగ్గే ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీటిని ఖచ్చితంగా తినాలి. ఇవి శరీరంలో వాటర్ లెవెల్స్ ఉండటానికి, ఎనర్జిటిక్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది. 


 అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మెటబాలిజంను పెంచుతుంది. ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు లేదా టీ రూపంలో తీసుకోవచ్చు. తృణధాన్యాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో క్యాలరీలను చాలా వేగంగా కరిగిస్తాయి. నీళ్లు ఫ్యాట్, క్యాలరీలు కరిగించి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీళ్లు సహాయపడతాయి. ఈ కారణం వల్లే.. ఎక్కువ నీళ్లు తాగాలని.. ప్రతి ఒక్కరూ సూచిస్తుంటారు.


 యాపిల్స్ లో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. యాపిల్ ని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నట్స్ అదనపు ఫ్యాట్ ని కరిగించడానికి సహాయపడతాయి. నట్స్ లో క్యాల్షియం, మినరల్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎక్స్ ట్రా ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునేవాళ్లు.. ఖచ్చితంగా నట్స్ తినాలి. అయితే ఇవన్నీ తింటున్నా కొన్ని మాత్రం తప్పనిసరిగా తగ్గించుకోవాలని వాటిలో పంచదార ఫస్ట్‌ వదిలేయడం మంచింది. ఇందులో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ ఫ్యాట్ కి పంచదారే కారణం. కాబట్టి.. పంచదార తీసుకోవడానికి తగ్గించాలి.


వీటిని ఓ సారి ట్రై చేసి చూడండి. వీటితో పాటు రెగ్యులర్‌గా సాధ్యమైనంత వరకు ఎక్సర్‌సైజ్‌ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీరు స్లిమ్‌గా అందగా తయారవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: