ఒకప్పుడు మనిషి ఆయుష్షు దాదాపు వందకు పైగానే ఉండేది..కానీ కాలక్రమేనా మనిషి ఆయుష్షు తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఇప్పుడున్న పొల్యూషన్, ఆహార పదార్థాల్లో కలుషితం. అయితే  వయసు మీద పడుతున్నకొద్దీ ముడతలు సహజం. కానీ కొందరికి వయసు తక్కువైనా ముడతలు వచ్చేస్తాయి. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించి ముడతలను మాయం చేసుకోవచ్చు. రెండు స్పూన్ల చెరుకురసంలో, పసుపు కలిపి ముద్దగా చేసి పావుగంట తర్వాత ముడతలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


కొబ్బరినూనె తో:   కొబ్బరినూనెను స్నానానికి ముందు ముఖం, మెడపై రాసుకొని పావుగంట తర్వాత స్నానం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే ముఖవర్చస్సు పెరుగుతుంది. ముడతలు తగ్గి ముఖంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.


పైనాపిల్: పైనాపిల్  రసాన్ని ముఖం అంతా పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆలుగడ్డలను గుజ్జులాగా తయారుచేసి ముఖానికి రాయాలి. ఎండిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.


టమాటో:  టమాటాలను స్లైస్ లాగా తయారు చేసుకొని ముఖానికి ప్యాక్ లా వేయాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.


రోజు అరటిపండు :   అరటిపండు గుజ్జును మొఖానికి రాస్తే ముడతలు మాయమవుతాయి. క్యారెట్ :   క్యారెట్ రసంలో పాలు, బాదం పప్పులను రుబ్బుకొని మొఖానికి ప్యాక్ వేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముడతలు తగ్గి కాంతివంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: